కీర్తి సురేశ్.. ఫెస్టివల్ స్పెషల్
on Feb 27, 2021
`మహానటి`తో నటిగా ఎనలేని గుర్తింపుని సంపాదించుకుంది కీర్తి సురేశ్. అయితే ఆ తరువాత ఆ స్థాయి విజయాన్ని మళ్ళీ అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో.. రాబోయే చిత్రాలపైనే తన ఆశలను పెట్టుకుంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
ప్రస్తుతం కీర్తి చేతిలో ఏడు చిత్రాలు ఉండగా.. వాటిలో మూడు సినిమాలు రిలీజ్ డేట్స్ ని కన్ఫామ్ చేసుకున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. సదరు మూడు చిత్రాలు కూడా పండగల సమయంలోనే థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. నితిన్ కి జోడీగా కీర్తి నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ `రంగ్ దే` హోలీ కానుకగా మార్చి 26న రిలీజ్ కానుంది. ఇక సూపర్ స్టార్ రజినీ కాంత్ కూతురిగా కీర్తి నటిస్తున్న `అణ్ణాత్తే` దీపావళి కానుకగా నవంబర్ 4న రాబోతోంది. అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబుకి జంటగా కీర్తి కనువిందు చేయనున్న `సర్కారు వారి పాట` 2022 సంక్రాంతికి వినోదాలు పంచనుంది. మొత్తమ్మీద.. ఫెస్టివల్ సీజన్స్ లో కీర్తి సురేశ్ బాగానే సందడి చేయబోతోందన్నమాట.
అన్నట్టు కీర్తి ఓ కీలక పాత్రలో నటించిన మలయాళ చిత్రం `మరక్కర్` కూడా మార్చి 26న విడుదల కాబోతోంది. కొన్నాళ్ళ క్రితం రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసింది యూనిట్. కాకపోతే, ఈ మధ్య ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో.. వాయిదా పడిందేమోనన్న మాటలు వినిపిస్తున్నాయి.
Also Read