English | Telugu

ఎన్టీఆర్ వాయిస్.. లక్ష్మీపార్వతికి అదిరిపోయే పంచ్!!

on Feb 1, 2019

 

తెలుగు సినిమా అయినా, రాజకీయమైనా మొదటగా గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్. సినిమాల్లో, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ చుట్టూ.. ఇప్పటికీ సినిమాలు, రాజకీయాలు తిరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ సబ్జెక్టు హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ జీవితం గురించి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. ముందుగా ఎన్టీఆర్ తనయుడు నటసింహ బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ కి శ్రీకారం చుట్టారు. ఈ బయోపిక్ ని ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇప్పటికే మొదటి భాగం విడుదలై పాజిటివ్ టాక్ తెచుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం ఊహించిన స్థాయిలో రాలేదు. త్వరలో మహానాయకుడు కూడా విడుదల కానుంది.

అయితే బాలకృష్ణకు పోటీగా రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ని అనౌన్స్ చేసాడు. 'బాలకృష్ణ తెరకెక్కిస్తున్న బయోపిక్ లో నిజాలు దాచిపెడతారు. తాము తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ లో అన్ని నిజాలు చెప్తాం. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కూడా మా సినిమాకే సపోర్ట్ చేస్తారు' అంటూ వర్మ హడావుడి స్టార్ట్ చేసాడు. అంతేనా వెన్నుపోటు సాంగ్ రిలీజ్ చేసి తనకిష్టమైన కాంట్రవర్సీకి తెరలేపాడు. లక్ష్మీపార్వతి కోణంలో ఎన్టీఆర్ అంటూ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ని తెరకెక్కిస్తుంటే.. వర్మకి పోటీగా 'లక్ష్మీస్ వీరగ్రంథం' అంటూ మరో సినిమా తెరకెక్కుతుంది. దీనిని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈయన కూడా వర్మ స్టైల్ లోనే కాంట్రవర్సీకి వెళ్తున్నారు. వర్మ, లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా సాంగ్స్, వాయిస్ లు విడుదల చేస్తున్నారు.

తాజాగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 'ఎన్టీఆర్ ఆత్మ సందేశం' పేరుతో ఒక వాయిస్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ఎన్టీఆర్ గుడిలో లింగాలన్ని ఎత్తుకెళ్లాడు అంటూ కాంగ్రెస్ నేత నాదెండ్ల భాస్కర్ రావు ఇటీవలె చేసిన ఆరోపణలతో ట్రైలర్ మొదలవుతోంది. తనపై ఇంత దుష్ష్రచారం జరుగుతన్నా లక్ష్మీ పార్వతి.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో మునిగిపోయారని ఎన్టీఆర్ ఆవేదన చెందుతున్నట్టు ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. మొత్తానికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తో వర్మ కాంట్రవర్సీ చేస్తుంటే.. వర్మకి పోటీగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంథం' అంటూ లక్ష్మీపార్వతిని టార్గెట్ చేస్తూ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాడు. మరి వీరిద్దరూ అసలు సినిమాలు రిలీజ్ చేస్తారో లేదో? ఒకవేళ చేస్తే ఎంత దుమారం రేగుతుందో ఏంటో చూడాలి.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here