ఈనెల 12న కొత్తజంట పాటలు
on Apr 9, 2014
అల్లు శిరీష్, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం "కొత్తజంట". ఈ చిత్ర కొత్త ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేసారు. అల్లు అరవింద్ సమర్పణలో మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీవాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ... "ప్రచార చిత్రం బాగుంది. ఈనెల 12న పాటలను, వచ్చే నెల 1న చిత్రాన్ని విడుదల చేస్తాము" అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ... "గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి వచ్చిన సినిమాల స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందీ చిత్రం. నా గత సినిమాలలాగే ఈ చిత్రం కూడా వినోదాత్మకంగా, కాస్త సందేశాన్ని అందించేలా ఉంటుంది" అని అన్నారు.