కళ్యాణ్ రామ్‘కిక్ 2’ మొదలుకాబోతుంది
on Aug 18, 2014
“రేసు గుర్రం”సినిమా హిట్ తో ఫుల్ జోష్ లో వున్న సురేందర్ రెడ్డి 'కిక్2' ప్రాజెక్ట్ ని తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నాడు. ఈనెల 20న ‘కిక్ 2’ ముహూర్తం జరుగనుందని లేటెస్ట్ న్యూస్. ఫస్ట్ ‘కిక్’ను సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఆర్ఆర్ మూవీ గ్రాండ్ స్కేల్లో నిర్మిస్తే కిక్ 2 ను ఎన్ టి ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హీరో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. “కిక్” సినిమా తరువాత రవితేజా, సురేందర్ రెడ్డి కలయికలో రాబోతున్న సినిమా ఇది. రవితేజ పాత్ర శైలి, నటన మరోసారి ప్రేక్షకులకు కావల్సినంత కిక్ ఇస్తాయని యూనిట్ చెబుతోంది.