ఎన్టీఆర్ బయోపిక్‌పై కీరవాణి సెటైర్లు!
on Jan 5, 2019
నందమూరి తారక రామారావు జీవితంపై రెండు సినిమాలు వస్తున్నాయి. అందులో 'యన్.టి.ఆర్' ఒకటి. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన సినిమా కావడంతో నందమూరి ఫామిలీ, ఫాన్స్ మద్దతు ఉంది. మరో సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. దీనికి వర్మ దర్శకుడు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన దగ్గర నుంచి ఏం జరిగిందనే కథతో ఆయన సినిమా తీస్తున్నారు. వర్మ వెనుక, ఈ సినిమా వెనుక టీడీపీ వ్యతిరేక శక్తులు వున్నాయని నందమూరి అభిమానులు ఆరోపణ. నందమూరి తారక రామారావు ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఈ సినిమా తీస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడీ సినిమాపై వర్మ స్నేహితుడు కీరవాణి కూడా సెటైర్స్ వేశారు.
ఎన్టీఆర్ జీవితంపై సినిమాల గురించి తాజా ఇంటర్వ్యూలో కీరవాణి దగ్గర ప్రస్తావించగా... "ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకం. ఎవరైనా చదువుకోవచ్చు. ఫలానావారు చదవకూడదని చెప్పలేం. మేము తీస్తున్నది అచ్చమైన బయోపిక్. మిగతావి బియోపిక్స్ అవునో కాదో నాకు తెలియదు" అన్నారు. ఈ మాటలకు అర్థం ఏమిటి? వర్మ తీసేది బయోపిక్ కాదనే కదా!! వర్మ సినిమాపై సెటైర్లు వేసిన కీరవాణి... వర్మ తీసిన వివాదాస్పద 'గాడ్.. సెక్స్ అండ్ ట్రూత్' (జిఎస్టీ)కి సంగీతం అందించారు. ఆ శృంగార చిత్రానికి వర్మ సంగీతం సమకూర్చమని అడిగిన తరవాత... చేయాలా? వద్దా? అని కీరవాణి సందేహించారట. చేసే ధైర్యం చేయలేదట. అప్పుడు ఏం జరిగిందో చెప్పాలంటే ఓ పెద్ద ఇంటర్వ్యూ అవుతుందని ఆయన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.