English | Telugu

కథనం మూవీ రివ్యూ

on Aug 9, 2019

నటీనటులు: అనసూయ , వెన్నల  కిషోర్, అవసరాల శ్రీనివాస్, ధనరాజ్, రణధీర్ తదితరులు
సినిమాటోగ్రఫీ:  సతీష్ ముత్యాల  
సంగీతం:  రోషన్ సాలూరి  
నిర్మాతలు:  బి. నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా  
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:  రాజేష్ నాదెండ్ల  
విడుదల తేదీ: 09.08.2019

అనసూయ అంటే హాట్ యాంకర్. హాట్ యాక్టర్ కూడా! 'జబర్దస్త్' కార్యక్రమంలో ఆమె వస్త్రాధారణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'రంగస్థలం'లో రంగమ్మత్తగా, 'సోగ్గాడే చిన్ని నాయన'లో బుజ్జిగా, 'విన్నర్'లో ప్రత్యేక గీతంతో వెండితెర ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు. 'క్షణం', 'యాత్ర' సినిమాల్లో హాట్ రోల్స్ కాకుండా సీరియస్ రోల్స్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటివరకూ అనసూయ చేసిన చిత్రాలన్నీ ఒక ఎత్తు... 'కథనం' మరో ఎత్తు. ఇందులో ఆమెది ప్రధాన పాత్ర. అనసూయ ఇమేజ్ మీద మార్కెట్ చేసిన సినిమా. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. మరి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కథ:  అను  (అనసూయ ) డైరెక్టర్   కావాలన్నది తన డ్రీమ్ . చాల మంది ప్రొడ్యూసర్స్ కి స్టోరీస్ చెబుతుంది కానీ , రిజెక్ట్ అవుతుంటాయి. ఇలాంటి క్రమం లో ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది మంచి స్టోరీ కావాలని. ఆ ప్రొడ్యూసర్స్ స్టోరీ ఇచ్చి డెవలప్ చేయమంటారు. అను చెప్ప్పిన విధానం నచ్చి సినిమా ఛాన్స్ ఇస్తారు ..ఆ నిర్మాతలు.  కథ క్లయిమాక్ మినహా మొత్తం రెడీ అవుతుంది. ఈ క్రమం లో అను రాసిన స్టోరీ లాగ మర్డర్స్ జరుగుతుంటాయి . రెండు మర్డర్స్ అలాగే జరగడం తో అను పోలీస్ లను ఆశ్రయిస్తుంది . అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు ? అను కథ రాసినట్లుగానే ఎందుకు జరుగుతున్నాయి అన్నది మిగతా స్టోరీ.


 విశ్లేషణ:

కథగా చెప్పాలంటే రొటీన్ రివెంజ్ డ్రామా కథనం అని చెప్పొచ్చు. కాకుంటే ఆ రివెంజ్ తీర్చుకునే విధానం పర్లేదు అనేలా ఉన్నా కానీ దాన్ని టైట్ కథనం తో ముందుకు తీసుకెళ్లలేకపోయాడు దర్శకుడు. కథలోకి తీసుకెళ్లడానికి చాల కథనం చాలా మధన పడింది అని చెప్పాలి. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే వెన్నల కిశోరె కామెడీ పరమ బోర్ కొట్టించింది, అస్లు ఆ ట్రాక్ అవసరమే లేదు. సన్నివేశాల్లోబలం లేకపోవడం  తో వెన్నెల  కిశోర్  కూడా ఏమి చేయలేకపోయాడు.  ఇక ఎప్పుడైతే అను తన స్క్రిప్ట్ ప్రకారం మర్డర్స్ జరుగుతున్నాయని తెల్సుకుందో అప్పుడు పోలీసులను ఆశ్రయిస్తుంది . ఇక తదుపరి మర్డర్స్ జరగకుండా ఆపాలని ఏసీపీ రణధీర్ తో కలిసి ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది అను.  అయినా ఆపలేక పోతారు. చని పోయిన అందరి లిస్ట్ తెప్పిచుకున్న రణధీర్ కి అసలు ఈ హత్యల్ని అను చేస్తుందని అర్ధమౌతుంది.  ఇక భాగమతి సినిమాలో అనుష్క చెప్పినట్లు ఒక స్టోరీ ని అల్లేసి రణధీర్ ని ఫూల్ చేస్తుంది అను.  ఎందుకు ఇలా చేసింది అంటే ఫ్లాష్ బ్యాక్ . అది ఒక ఊరు , ఆమెకు పేద పేరు . వావారి బాగు కోసం అను మదర్ అరవింద పోరాటం అందులో విల్లన్స్ చేతిలో చనిపోవడం ఇది కథ . కొసమెరుపు ఏంటంటే అను మదర్ ని అను ఫాదర్ చంపడం . అను తన  ఫాదర్ ని చంపడానికి ప్రయత్నించడం . ఈ ట్విస్ట్ ఇంట్రస్టింగ్ ఉన్నప్పటికీ చాల ల్యాగ్ తో దాన్ని కాస్త బోర్ కొట్టేలా చేసాడు.  

ప్లస్ పాయింట్స్:

బ్యాక్ గ్రౌండ్ స్కోర్
 అనసూయ
అక్కడక్కడా స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్:

రొటీన్ రివెంజ్ స్టోరీ
వెన్నల  కిశోర్ కామెడీ ట్రాక్
ల్యాగ్ సీన్స్
ఓల్డ్ నరేషన్

నటీనటుల పనితీరు:
అనసూయ , అను గా , అరవిందగా రెండు పాత్రలకు జస్టిఫై  చేసింది.  రెండు పాత్రలకు వేరియేషన్ కూడా చూపుంచి తన శక్తి మేరకు సినిమాను నిలబెట్టడానికి ట్రై చేసింది. ధన్ రాజ్ పాత్ర ఓకే . రణధీర్ కూడా తన బెస్ట్ ఇచ్చాడు. మిగతా వారంతా ఓకే .

సాంకేతిక  నిపుణులు:
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది . అలాగే సినిమాటోగ్రఫీ కథ మూడ్ కి తగట్టుగా ఉంది . అరవింద పాత్రకు రాసిన సంభషణలు బావున్నాయి.

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

రివెంజ్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా అనసూయ తన భుజాల పై సిఎంమాను మోసింది . ఇక ఆమె ను జబర్దస్త్ షోలో చూసినట్టు చూడాలకునే వారికీ నిరాశే మిగులుతుంది. అందం తో కాకుండా అనసూయ అభినయం తో  ఆకట్టుకుంట్టుంది. ఇక దర్శకుడు కథ ను ఆసక్తి కరమైన కథనం తో కాకుండా ..ఓల్డ్ నరేషన్ తో తీసుకెళ్లడం తో సినిమా రొటీన్ సినిమా గా  మిగిలిపోయింది.  సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి సినిమా ఏంటో ఊహించేవింధంగా ఉండటం తో ఉత్కంఠ అనేది లేకుండా పోయింది.  అక్కడక్కడా కథనం ఆకట్టుకుంట్టుంది.

రేటింగ్:  2.25/5


Cinema GalleriesLatest News


Video-Gossips