శ్రీదేవివి పాటలు వేశారు, మరి సన్నీ లియోన్ చనిపోతేనో...
on Mar 1, 2018
సీనియర్ నటి కస్తూరి ఒకానొక టైం లో మంచి సినిమాలు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. తరవాత కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తన ప్రాభవం చూపిస్తుంది. అందరిలా తన పని తాను చేసుకుపోకుండా... తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంది. మొన్నామధ్య కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కస్తూరి, కాస్టింగ్ కౌచ్ విషయంలో సీనియర్ నటుల్ని దుమ్మెత్తి పోసింది. ఇక ఆమె కొత్తగా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన స్టేట్మెంట్ వివాదాస్పదమైంది.
"శ్రీదేవి చనిపోయిందని వార్త రాగానే ప్రతి న్యూస్ ఛానల్ ఆమె పాటలు, వీడియో లు మరియు సినిమాలు వేస్తున్నారు. మరి, సన్నీ లియోన్ చనిపోతే ఏం చేస్తారో... ఏం ప్రదర్శిస్తారో..." అని తన స్థాయిని తక్కువ చేసుకునేలా ట్వీటారు. ఈ వ్యాఖ్యపై సోషల్ మీడియా లో అభ్యంతరం చెప్పడంతో, తాను పేస్ బుక్ లో వచ్చిన ఒక జోక్ ని షేర్ మాత్రమే చేసానని సమాధానం ఇచ్చింది. ఒక సీనియర్ నటి, బాధ్యతాయుత పౌరురాలాయి ఉండి... వెనక ముందు ఆలోచించకుండా కస్తూరి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అనే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.