English | Telugu

జోరు మీదున్న ‘టాక్సీవాలా’ భామ!

on Jan 7, 2019

‘టాక్సీవాలా’తో తెలుగు తెరకు పరిచయమైన తెలుగమ్మాయి ప్రియాంకా జవాల్కర్‌. మొదటి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఈమెకు ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయతో నటించే అవకాశం దక్కిందని సమాచారం! ‘ఆర్‌ఎక్స్‌ 100’లో భగ్న ప్రేమికుడిగా తన నటనతో ఇటు పరిశ్రమ వర్గాలను... అటు ప్రేక్షకులను... కార్తికేయ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ‘హిప్పీ’ అనే సినిమాలో నటిస్తున్న ఈ యువ హీరో... బోయపాటి శిష్యుడు అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించిన సంగతి తెలిసిందే. అందులో కార్తికేయ సరసన ప్రియాంకా జవాల్కర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారట! ఈ సినిమా కాకుండా... నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ తనయుడు, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ సోదరుడు బెల్లంకొండ గణేష్‌ హీరోగా పరిచయం కానున్న సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చిందని టాక్‌. రవితేజ సినిమాలోనూ ప్రియాంకా జవాల్కర్‌ నటించనున్నారని సమాచారం! వరుస అవకాశాలతో ఈ భామ మంచి జోరు మీదుంది!!


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here