దీపికాను బాయ్‌కాట్ చేయమంటున్న కంగనా రనౌత్
on Sep 22, 2020
బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శక-నిర్మాతలపై విమర్శలు చేయడానికి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా? అని కంగనా రనౌత్ ఎదురు చూస్తున్నారు. డ్రగ్స్ కేసులో దీపికా పదుకొనె పేరు రావడంతో ఆమె బాలీవుడ్ డ్రగ్గీలను బాయ్‌కాట్ చేయమని పిలుపు ఇచ్చారు. దీపికా పదుకొనె పేరును ప్రస్తావిస్తూ ఆమె ట్వీట్ చేయడం గమనార్హం.
దీపికా పదుకొనెకు మంగళవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సమన్లు జారీ చేయనుందనే సంగతి తెలిసిందే. దీపికా సహా కొంతమంది హీరోయిన్లకు సమన్లు జారీ చేస్తామని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా చెప్పారు. ఈ నేపథ్యంలో దీపికాను టార్గెట్ చేస్తూ కంగనా రనౌత్ ట్వీట్లు చేశారు. డ్రగ్స్ దుర్వినియోగం డిప్రెషన్ కి దారి తీస్తుందని ఆమె అన్నారు. తమను తాము క్లాసీ అని చెప్పుకొనే హైక్లాస్ స్టార్ చిల్డ్రన్ 'మాల్ హై క్యా' అని మేనేజర్లను అడుగుతారని కంగనా రనౌత్ కామెంట్లు చేశారు.
"మన దేశ యువతను, మన భవిష్యత్తును నాశనం చేయడానికి... పొరుగు దేశాలలోని స్వార్థ ప్రయోజనాల కోసం నార్కో టెర్రరిజం విరుచుకుపడుతోంది. మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్ళలో ఇదొకటి" అని కంగనా రనౌత్ పేర్కొన్నారు.
Also Read