ఇటు జయలలిత... అటు అయోధ్య
on Nov 26, 2019
కంగనా రనౌత్ నిర్మాతగా మారుతోంది. బాబ్రీ మసీదు కూల్చివేత, అయోధ్య రామ మందిరం నిర్మాణం, ఆ కేసులో ఇటీవల సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తుది తీర్పు నేపథ్యంలో 'అపరాజిత అయోధ్య' నిర్మిస్తున్నట్టు నిన్న ప్రకటించింది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఈ సినిమా ప్రకటనతో ఒక్కసారి దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు, ప్రేమికులతో పాటు ముఖ్యంగా ఉత్తరాదిలో మత గురువులు, రాజకీయ నాయకుల దృష్టిని కంగనా రనౌత్ ఆకర్షించారు. దక్షిణాది ప్రజలూ ఈ సినిమా ప్రకటనపై ఆసక్తి కనబరిచారు. అయితే... అదే సమయంలో కంగనా రనౌత్ మీద దక్షిణాదిలో విపరీతమైన ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. 'తలైవి' ఫస్ట్ లుక్, టీజర్ విషయంలో!
జయలలితగా కంగనా రనౌత్ లుక్ విమర్శలకు కారణమైంది. కంగనను బంగాళాదుంపతో పోల్చారు కొందరు నెటిజన్లు. ఆమె కంటే 'భామనే సత్యభామనే'లో కమల్ హాసన్ లేడీ గెటప్ జయలలిత పాత్రకు సూట్ అవుతుందేమో అని కొందరు వెటకారం చేశారు. అల్లరి నరేష్ కు లడ్డూబాబు సూట్ వేసినట్టు, కంగనాకు ఏదో సూట్ వేసినట్టు ఉందని ఇంకొందరు కామెంట్ చేశారు. ఒక్కటి నిజం... జయలలితగా కంగనా రనౌత్ ఏమాత్రం సూట్ కాలేదనేది. ఈ విమర్శలను పక్కనపెట్టి 'అపరాజిత అయోధ్య' ప్రకటించింది కంగనా రనౌత్. ఇటు జయలలిత.... అటు అయోధ్యతో వార్తల్లో నిలిచింది.