సెప్టెంబర్ 10న ఉత్తమ విలన్ విడుదల
on Apr 23, 2014
కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "ఉత్తమ విలన్". తిరుపతి బ్రదర్స్ ఫిల్మ్ మీడియా ప్రై.లిమిటెడ్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లపై ఎన్.లింగుస్వామి, కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆండ్రియా, పూజ కుమార్, పార్వతీ మీనన్, పార్వతీ నాయర్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.