English | Telugu

జయలలితగా కాజోల్.. శశికళగా అమలాపాల్?

on Apr 9, 2019

 

దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆదివారం 'శశిలలిత' సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. ఓ లుక్ కూడా విడుదల చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ముఖం సగం, ఆమె నిచ్చెలి శశికళ ముఖం సగం మార్ఫ్ చేసిన లుక్ అది! దాంతో తమిళ ప్రజల్లో సినిమాపై ఆసక్తి ఏర్పడింది. జయలలిత బాల్యం నుంచి, 75 రోజులు ఆసుపత్రిలో ఉండటం వరకూ పలు ప్రధానాంశాలు సినిమాలో చూపిస్తానని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. జయలలిత పాత్రకు కాజోల్, శశికళ పాత్రకు అమలా పాల్ ను సంప్రదించామని, ఇద్దరికీ పాత్రల సారాంశం చెప్పానని, వారి నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

జయలలిత జీవితంపై నిత్యామీనన్ ప్రధాన పాత్రధారిగా ఒక బయోపిక్ తెరకెక్కుతోంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ఒక బయోపిక్ ఇటీవల ప్రారంభమైంది. కేతిరెడ్డి వ్యవహారశైలి తెలిసిన కొందరు ఈ 'శశిలలిత' సినిమాను అంత సీరియస్ గా తీసుకోవలసిన అవసరం లేదని కొట్టి పారేస్తున్నారు. తెలుగులో రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రకటించిన తరవాత... 'లక్ష్మీస్ వీరగ్రంధం' సినిమా ప్రకటించారు కేతిరెడ్డి. అందులో లక్ష్మీపార్వతిగా రాయ్ లక్ష్మి లేదా మరొక అగ్రతార నటిస్తారని, ప్రస్తుతం చర్చలు జరుపుతున్నామని అప్పట్లో స్టేట్మెంట్స్ ఇచ్చారు. తరవాత ఎవరో చిన్న తారతో సినిమా పూర్తి చేశారు. అదింకా విడుదల కాలేదు. ఏమైందో కూడా తెలియదు. ఆ కోవలో ఈ 'శశిలలిత' కూడా చేరుతుందని సినిమా విశ్లేషకుల అభిప్రాయం.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here