కాజల్ కన్ఫర్మ్ చేసింది!
on Dec 4, 2018
ఓ పక్క కుర్ర హీరోలతో నటిస్తూ... మరోపక్క సీనియర్ హీరోల సినిమాలకు కాజల్ సంతకం చేస్తోంది. తన కంటే వయసులో ఎనిమిదేళ్లు చిన్నవాడైన బెల్లకొండ సాయిశ్రీనివాస్ సరసన 'కవచం'లో నటించిందీ చందమామ. తన కంటే వయసులో 30 ఏళ్లు పెద్ద అయిన కమల్ హాసన్‌తో నటించడానికి సంతకం చేసింది. శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా 'భారతీయుడు 2' సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా కాజల్ నటించనుందని వార్తలొచ్చాయి. అవి నిజమేనని కాజల్ కన్ఫర్మ్ చేసింది. కమల్‌తో 'భారతీయతుడు 2'తో నటించనున్నట్టు తెలిపింది. ఇటు కమల్‌తోనూ.. అటు శంకర్‌తోనూ కాజల్‌కు ఇదే తొలి సినిమా. తమిళంలో కాజల్ ప్రధాన పాత్రలో నటించిన 'పారిస్ పారిస్' త్వరలో విడుదల కానుంది. హిందీలో విజయం సాధించిన 'క్వీన్'కి రీమేక్ అది. ఈ శుక్రవారం విడుదల కానున్న 'కవచం'తో పాటు బెల్లకొండ సాయిశ్రీనివాస్ సరసన తేజ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.