స్లమ్ కుర్రాళ్లకు సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్
on Sep 12, 2017
సినిమా ఛాన్స్ రావడమే.. అదృష్టంగా భావించే ఈ రోజుల్లో.. ఏకంగా సూపర్ స్టార్ సినిమలో ఛాన్స్ వస్తే.. ఆనందానికి అవధులుంటాయా? ప్రస్తుతం ముంబయ్ కి చెందిన కొందరు కుర్రాళ్లు అదే ఆనందంలో ఉన్నారు. పా రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ‘కాలా’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఈ కుర్రాళ్ల గ్రూప్ కి అవకాశం ఇచ్చాడు పా రంజిత్. ఇంతకీ ఈ కుర్రాళ్ల గురించి చెప్పనే లేదు కదూ.. ముంబాయ్ లో ధారావీ అనే ఏరియా పేరు వినే వుంటారు. నేరగాళ్లకు అడ్డా అది. కానీ అది ఒకప్పటి మాట. ఇప్పుడు అక్కడ అంత క్రైమ్ లేదు. ఎక్కువ శాతం దిగువ మధ్య తరగతి జీవితాలు కనిపించే ప్రాంతం అది.
ఒకప్పుడు నేరాలాకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఆ ఏరియా ఇప్పుడు ఓ ర్యాప్ గ్రూప్ కి చాలా ఫేమస్. ఓ పదిమంది కుర్రాళ్లు కలిసి ఈ ర్యాప్ గ్రూప్ పెట్టారు. వాళ్లే ప్రోగ్రామ్స్ ఇస్తూ ముంబయ్ మొత్తం ఫేమస్ అయ్యారు. హిందీ మాత్రమే కాక, తమిళ, మలయాళ, మరాఠీ భాషల్లో పాటలను వారే రాసుకొని ప్రదర్శనివ్వడం ఈ ట్రూప్ స్పెషాలిటీ. ఇదిలావుంటే.. వీరి ఖ్యాతి.. అలా అలా.. దర్శకుడు పా రంజిత్ చెవిన పడింది. అంతే వారి సుడి తిరిగింది. సూపర్ స్టార్ ‘కాలా’సినిమాలో వారి ట్రూప్ కి అవకాశం వచ్చింది. కథలో భాగంగా వారు సినిమాలో ఓ ప్రోగ్రామ్ ఇస్తారన్నమాట. దీనికోసం తలైవా పై ప్రత్యేకంగా ఓ పాటను సొంతంగా రాసుకొని ప్రాక్టీస్ చేసింది ఈ గ్రూప్. రీసెంట్ గా ఈ గ్రూప్ ‘కాలా’ షూటింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు తలైవాను చూసి వారి ఆనందం కట్టలు తెగింది. ‘లొకేషన్లో రజనీ సార్.. ని చూడగానే.. నోట మాట రాలేదు’ అని టీమ్ లీడర్ టోని సెబాస్టియన్ తెలిపారు. వీరి పాట సినిమాలోనే హైలైట్ అవుతుందని టాక్.
Also Read