English | Telugu

కాలా రివ్యూ

on Jun 7, 2018

 

భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌నే త‌న వైపుకు తిప్పుకునే క్రేజ్‌ ర‌జ‌నీకాంత్ సొంతం. న‌ట‌న స్టైల్‌, మేన‌రిజంతో ఎన్నో సినిమాల్ని ఒంటి చేత్తో లాక్కొచ్చేశాడు. ర‌జ‌నీకాంత్ న‌టించిన అనువాద చిత్రాలెన్నో.. తెలుగు నాట స్టార్ హీరోల‌తో పోటీ ప‌డి విజ‌యాలు సాధించాయి. ర‌జనీ మానియా ఎలాంటిదో తెలుగు బాక్సాఫీస్‌కీ బాగా తెలుసు. ఆయ‌న్నుంచి సినిమా వ‌స్తోందంటే క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తుంటారు. అయితే 'రోబో' త‌ర‌వాత ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వ‌లేదు. ఎన్నో అంచ‌నాలు పెంచుకున్న 'క‌బాలి' సైతం నిరుత్సాహ ప‌రిచింది. ఈ ద‌శ‌లో `కాలా` అంటూ మ‌ళ్లీ ప్ర‌త్య‌క్షం అయ్యాడు ర‌జ‌నీ. 'క‌బాలి'లో మిస్స‌యిన ర‌జ‌నీ హీరోయిజం, ద‌మ్ము ఈ సినిమాలో క‌నిపించాయా?  ర‌జ‌నీ మ‌రోసారి మ్యాజిక్ చేయ‌గ‌లిగాడా?   చూద్దాం.. రండి.

* క‌థ‌

థారావి అనే మురికివాడ అది. అక్క‌డే పుట్టి పెరిగి, ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు నాయ‌కుడిగా మారాడు కాలా (ర‌జ‌నీకాంత్‌). ధారావి నుంచి వెళ్లి... రాజ‌కీయాల్లో ఎదిగి.. ధారావిపైనే క‌న్నేసిన రాజ‌కీయ నాయ‌కుడు హ‌రి దాదా (నానా ప‌టేక‌ర్‌).  ఎలాగైనా స‌రే, ధారావిని సొంతం చేసుకోవాల‌నుకుంటాడు. ఆ ప్ర‌య‌త్నాల్ని కాలా అడ్డుకుంటుంటాడు. దాంతో కాలాపై, ధారావిపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతాడు హ‌రి దాదా. ఈ పోరాటంలో కాలా త‌న కుటుంబాన్నిసైతం కోల్పోవాల్సివ‌స్తుంది. అధికార బ‌లంతో విర్ర‌వీగుతున్న హ‌రిపై కాలా ఎలాంటి పోరు సాగించాడు?  అందులో విజ‌యాన్ని ఎలా ద‌క్కించుకున్నాడు?  అనేదే క‌థ‌.


విశ్లేష‌ణ‌

చాలా సాధార‌ణ‌మైన క‌థ ఇది. ఖ‌రీదైన భూమి, దాన్ని లాక్కోవాల‌నే  ఓ దుర్మార్గుడూ, అడ్డుకునే క‌థానాయ‌కుడు. ఇంత‌కు మించిన పాయింటేం లేదు క‌థ‌లో.  అయితే ర‌జ‌నీ కాంత్ సినిమాల్లో గొప్ప క‌థ లేక‌పోయినా - ర‌జ‌నీ స్థాయి మ్యాజిక్ ఉంటే చాలు. వ‌ర్క‌వుట్ అయిపోతుంది. డైలాగులు, మేన‌రిజమ్స్‌తో సినిమాని కాస్త న‌డిపించొచ్చు. `కాలా` అనే పాత్ర‌, అందులో ర‌జ‌నీ గెట‌ప్పు చూసి.. నిజంగానే ర‌జ‌నీకాంత్ హీరోయిజం ఓ లెవిల్లో ఉంటుంద‌ని భ్ర‌మ‌ప‌డ‌తాం. కానీ.. అది సినిమా మొద‌లైన కాసేప‌టికే మ‌న `దురాశ‌` అని తేలిపోతుంది. `క‌బాలి` అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ తో సినిమా తీసి - ర‌జ‌నీలోని హీరోయిజం దాచేసి - సెంటిమెంట్ ట‌చ్ ఇచ్చాడు రంజిత్‌. సరిగ్గా ఇక్క‌డా అదే చేశాడు. `కాలా` అనే టైటిల్లో ఉన్న ప‌వ‌ర్‌.. పాత్ర‌లో ఉండ‌దు. తొలి స‌గం కాలా ఇంటి స‌న్నివేశాలు, త‌న పాత ప్రేమ‌క‌థ‌, ఫ్లాష్ బ్యాక్‌ల‌తో న‌డిపించేశాడు. అవేమైనా బాగున్నాయా అంటే.. నీర‌సం, చాద‌స్తం త‌ప్ప ఇంకేం క‌నిపించ‌వు. హీరో - విల‌న్ల మ‌ధ్య పోరు ఎప్పుడో ఇంట్ర‌వెల్ ముందు ప్రారంభం అవుతుంది. ఇంట్ర‌వెల్ ముందు సాగే స‌న్నివేశాలు చూస్తే... రంజిత్, ర‌జ‌నీకాంత్ ఇద్ద‌రూ క‌ల‌సి సెకండాఫ్‌లో విజృంభిస్తార‌నుకుంటారు. కాఈ,నీనీ ఆఅది కూడా జ‌ర‌గ‌లేదు. సెకండాఫ్ మ‌రింత నానీర‌సం ఆవ‌హిస్తుంది. స్లో నేరేష‌న్‌తో బాగా ఇబ్బంది పెడ‌తాడు. హీరోలో ఫైర్‌, విల‌న్ల‌ లో ద‌మ్మున్నా. ర‌. రెండిట‌టినీ వాడుకోలేదు.  ధారావి అనే సెట్ దాటి క‌థ ఎప్పుడూ బ‌య‌ట‌కు వెళ్ల‌లేదు. ఆదాంతో వ‌స‌న్నివేశాల్లోనే కాదు, లొకేష‌న్ల‌న‌ల‌లోనూ వైవిధ్యం క‌కొర‌వ‌డింది. క్లైమాక్స్ లో  కాలా చ‌నిపోయాడా, లేదంటే అదంతా ఢ‌భ‌భ్ర‌మా, లేదంటే బ‌తికే ఉ్న్నాడా, అనేది మ‌రో ట్ఇస‌ట‌స్విట్విస్టు. ఇది కాలా లాంటి క‌థ‌కు అవ‌స‌రం లేఉద‌. దు. అక్క‌డ‌క్క‌డ కొన్ని మెరుపులు త‌ప్ప‌... సినిమాలో ఎక్్క‌డ‌క్క‌డా ర‌జ‌నీ స్థాయి మ్యాజిక్ క‌నిపించ‌లేదు.


* నటీన‌టులు

ర‌జ‌నీకాంత్ త‌న అభిమానుల్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. త‌న లుక్స్‌, మేన‌రిజం, స్టైల్ ఈ సినిమాలో క‌నిపించింది అంతంత మాత్ర‌మే. ఉన్నంత‌లో ఫ్యాన్స్ తో ఈల‌లు వేయించాడు. ప్ర‌తినాయ‌కుడిగా నానా ప‌టేక‌ర్ ని తీసుకుని తెర‌కు నిండుద‌నం తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కానీ అదీ ఫ‌లించ‌లేదు. పాత్ర‌లోబ‌లం లేక‌పోవ‌డం, హీరో - విల‌న్ల సంఘ‌ర్ష‌ణ‌ని స‌రిగా వాడుకోక‌పోవ‌డంతో నానా ప‌టేక‌ర్ ఎంట్రీకి స‌రైన న్యాయం జ‌ర‌గ‌లేదు. ఈశ్వ‌రీరావు పాత్ర‌కు ప్ర‌ధాన్యం ఉంది. కాక‌పోతే.. అందులో త‌మిళ యావ ఎక్కువ‌గా క‌నిపించింది. హ్యూమా అందంగా హుందాగా ఉంది.

* సాంకేతిక వ‌ర్గం

డ‌బ్బులు ఎక్కువ ఖ‌ర్చు పెట్ట‌కూడ‌దు - అన్న నిబంధ‌న మేర ఈ సినిమాని పూర్తి చేసిన‌ట్టు అనిపించింది. ఒకే సెట్‌లో సినిమా మొత్తం లాగించేశారు. ఆ సెట్ మాత్రం బాగుంది. నిజంగా ఓ మురికివాడ‌ని చూసిన ఫీలింగ్ క‌లిగింది. పాట‌లు, నేప‌థ్య సంగీతం ఏమాత్రం ఆక‌ట్టుకోవు. ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉండాల్సింది. క‌బాలి త‌ర‌వాత‌... రంజిత్‌కి మ‌రో సారి ర‌జనీ అవ‌కాశం ఇవ్వ‌డం గొప్ప విష‌యం. కానీ దాన్ని వాడుకోలేదు. ర‌జ‌నీ ఫ్యాన్స్ మెచ్చేలా ఈ సినిమా తీయ‌లేక‌పోయాడు.

* ప్ల‌స్ పాయింట్స్‌
ర‌జ‌నీ
కొన్ని సీన్లు

* మైన‌స్ పాయింట్స్‌
మిగిలిన‌వ‌న్నీ

* పంచ్ లైన్‌:  ఇది కూడా క‌'బాలే'

రేటింగ్‌: 2.5


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here