కాలా వసూళ్లని దెబ్బతీసిన ప్రీమియర్ షో
on Jun 8, 2018
ఎంతోకాలంగా అభిమానులను ఊరిస్తూ వచ్చిన కాలా ఎట్టకేలకు విడుదలైంది. కానీ కాలా రివ్యూలు ఏమంత గొప్పగా లేవు. సినిమా అద్భుతం అన్న మాటలే వినిపించలేదు. పైగా మరో కబాలిని చూసిన ఫీలింగ్ కలిగిందని పెదవి విరిచారు ప్రేక్షకులు. ప్రీమియర్ షోల తర్వాతే రివ్యూలు వచ్చేయడం వల్ల కాలా మొదటి రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయట. ఈమధ్యకాలంలో రజనీకాంత్ సినిమాలు వేటకీ ఇంత తక్కువ ఓపెనింగ్స్ రాలేదని చెప్పుకొంటున్నారు. ఒక అంచనా ప్రకారం ప్రీమియర్ షోలకి వచ్చిన వసూళ్లలో మూడోవంతే మిగతా షోలకి వచ్చాయట. మరి కాలా మరో డిజాస్టర్‌గా మిగిలిపోతుందా, శనాదివారాలకి పుంజుకుంటుందా చూడాలి!