కాలా సినిమాతో రియల్ హీరో అనిపించుకున్న విశాల్
on Jun 7, 2018
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ఎప్పుడు రిలీజైనా విపరీతమైన క్రేజ్ ఉంటుంది.. హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురుస్తుంది.. అందుకే ఎంతమంది వచ్చినా రజినీకాంత్ ఎప్పటికీ రజినీకాంతే.. ఇక అసలు విషయానికొస్తే ఈ రోజు రజినీకాంత్ 'కాలా' సినిమా రిలీజయ్యింది.. సినిమా ఎలా ఉందన్న టాక్ కంటే ముందే పైరసీ వచ్చింది.. ఫారెన్ లో పడిన ప్రీమియర్ షోని ఒక ఆకతాయి ఫేస్బుక్ లైవ్ స్ట్రీమ్ ఇచ్చాడు.. ఇది తెల్సిన విశాల్.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు.. వెంటనే యాంటీ పైరసీ సెల్, సైబర్ క్రైమ్ పోలీసుల్ని అలెర్ట్ చేసి.. ఆ లైవ్ స్ట్రీమ్ ఆపించాడు.. అంతే కాకుండా ఆ లైవ్ స్ట్రీమ్ ఇచ్చిన అతన్ని అరెస్ట్ చేయించాడు.. కాలా సినిమా పైరసీ విషయంలో విశాల్ చూపించిన చొరవకి రియల్ హీరో అనిపించున్నాడు..