'మాస్' జోడి మరోసారి
on Apr 13, 2019
2016 లో నాగార్జున, కళ్యాణ్ కృష్ణ కురసాల కలయిక లో వచ్చిన చిత్రం `సోగ్గాడే చిన్నినాయనా`. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచి నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినది. సోసియో ఫాంటసీ మూవీ గా తెరకెక్కిన ఆ సినిమా లో బంగార్రాజు గా నాగార్జున చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే పాత్ర పేరుతో సీక్వెల్ గా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. దీనికి `బంగార్రాజు` అనే టైటిల్ ఓకే చేసారు. అయితే ప్రెసెంట్ ఆర్టిస్ట్స్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ పార్ట్ లో బంగార్రాజుకు జోడిగా రమ్యకృష్ణ నటించిన విషయం తెలిసిందే . సెకండ్ పార్ట్ లో కూడా అదే పాత్ర లో కనిపించనుందని టాక్. ఫస్ట్ పార్ట్ లో రాము కు పెయిర్ గ లావణ్య త్రిపాఠి నటించింది. ఇక సెకండ్ పార్ట్ లో నయనతార ను ఎంపిక చేసినట్లు ఇటీవల న్యూస్ వచ్చాయి. అయితే తన కాల్ షీట్స్ అడ్జెస్ట్ కాకపోవడం తో నయన ప్లేస్ లో జ్యోతిక ను తీసుకున్నట్లు సమాచారం. గతం లో నాగార్జున, జ్యోతిక జంటగా మాస్ సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి సక్సెస్ అయ్యింది. మరి ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందో లేదో చూద్దాం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది.