ఎన్టీఆర్ బయోపిక్.. బాలయ్య పాత్రలో తారక్..!!
on Aug 8, 2018
ఎన్టీఆర్ బయోపిక్ మీద రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా వస్తున్న ఈ సినిమాలో పలు ప్రత్యేక పాత్రలు ఉన్నాయి.. ఎన్టీఆర్ భార్య పాత్రలో విద్యాబాలన్ నటిస్తుండగా.. నారా చంద్రబాబుగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, హరికృష్ణగా కల్యాణ్ రామ్, సూపర్‌స్టార్ కృష్ణగా మహేష్ బాబు కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.. అయితే తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.. ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ గా బాలయ్య కనిపిస్తున్నారు సరే, మరి బాలయ్యగా ఎవరు కనిపిస్తున్నారు? అని గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.. అయితే బాలయ్య పాత్రలో తారక్ నటించబోతున్నారని సెన్సేషనల్ వార్త వినిపిస్తోంది.. బాలయ్య పాత్రలో తారక్ ను నటింపజేయాలన్న ప్రతిపాదనను దర్శకుడు క్రిష్ తెరపైకి తీసుకురాగా, అందుకు బాలయ్య కూడా సుముఖంగా ఉన్నట్టు సమాచారం.. ఇదే నిజమైతే నందమూరి అభిమానులకు పండగే.