ముందు ఎన్టీఆర్... లేటెస్టుగా గోపీచంద్!
on Sep 15, 2018
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరూ రాయని ఓ సెంటిమెంట్ వుంది. అదేంటంటే... ఒకే తరహాలో కొన్ని విషయాలు జరిగితే దాన్నో సెంటిమెంట్‌గా భావిస్తారు. అది మంచి కావొచ్చు... లేదా చెడు సెంటిమెంట్ కావొచ్చు. ఉదాహరణకు... దర్శకులు రెండో సినిమా ఫ్లాప్ అవుతుందనేది ఓ సెంటిమెంట్. దీన్ని బ్రేక్ చేసినవాళ్లు వున్నారనుకోండి. ఈ విధంగా ప్రజెంట్ జనరేషన్ హీరోల సంతానం విషయంలో ఓ సెంటిమెంట్ వుంది. అదేంటంటే....
హీరోలకు ముందు అబ్బాయి పుడతాడని, తరవాత అమ్మాయి పుడుతుందని! ఉదాహరణకు... అల్లు అర్జున్ ముందు అబ్బాయి అయాన్‌కి తండ్రి అయ్యాడు. తరవాత అమ్మాయి అర్హకి తండ్రి అయ్యాడు. నందమూరి కల్యాణ్‌రామ్‌కీ అంతే. మొదట అబ్బాయి శౌర్యారామ్, తరవాత అమ్మాయు అద్విత. ఈ జాబితాలోకి రానివాళ్లూ వున్నారు. మంచు విష్ణు ముందు ఇద్దరు అమ్మాయిల(ట్విన్స్)కు తండ్రి అయ్యాడు. తర్వాత అతడి ఇంట వారసుడు అడుగుపెట్టాడు. ‘అల్లరి’ నరేశ్‌కి మొదట అమ్మాయే పుట్టింది. అయితే... వరుసగా ఇద్దరు అబ్బాయిలకు తండ్రి అయిన హీరోలూ వున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి ఇద్దరూ అబ్బాయులే. మొదట అబ్బాయి పుట్టడంతో తర్వాత అమ్మాయి పుడుతుందని కొంతమంది సెంటిమెంట్ అనుసరించి చెప్పేశారు. కానీ, రెండోసారీ ఎన్టీఆర్‌కి అబ్మాయే పుట్టాడు. గోపీచంద్‌కీ అంతే. సీనియర్ హీరోల్లో నాగార్జునకు మాత్రమే ఇద్దరు కుమారులు వున్నారు. ఈతరంలో ఎన్టీఆర్, గోపీచంద్ వున్నారు.