`ఆట కాదు వేట` అంటూ దుమ్ములేపిన ఎన్టీఆర్!!
on Jul 6, 2019
ఐపియల్ ఇన్ స్పిరేషన్ తో ప్రారంభమైన ప్రో కబడ్డీ దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకుని దూసుకెళ్తోంది. జూలై 20 నుంచి ఈ టోర్నమెంట్ నెక్ట్స్ సీజన్ మొదలు కానుంది. అయితే ఈ టోర్నమెంట్ `స్టార్ మా` , హాట్ స్టార్ లో టెలికాస్ట్ కానుంది. అయితే దీనికోసం ఓ వీడియో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై షూట్ చేసారు. ఆ వీడియో ప్రజంట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కబడ్డీ అంటే `ఆట కాదు వేట ` అంటూ తనదైన స్టైల్ లో డైలాగ్ చెప్పిన ఆ వీడియో కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ప్రో కబడ్డీ కి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం ఇది సెకండ్ టైమ్. ఇప్పటికే 50 కె వ్యూస్ తో ఈ వీడియో క్రేజీ కామెంట్స్ , షేర్ లతో , అప్రిషియేషన్స్ తో దూసుకెళ్తోంది. దీంతో ప్రో కబడ్డీ కోసం ప్రేక్షకులకు ఆసక్తి పెరిగి, అందరూ ఆతృతతో ఎదురు చూసేలా చేసాడు యంగ్ టైగర్.