రాముడి ఇంట్లో పుట్టిన కృష్ణుడు
on Jul 22, 2014
జూనియర్ ఎన్టీఆర్ ఇంట వారసుడు పుట్టాడు. నందమూరి వంశంలోకి ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణీతల ముద్దుల సంతానంగా అడుగుపెట్టిన ఈ వారసుడు శ్రీ కృష్ణ భగవానుడు పుట్టిన రోహిణి నక్షత్రంలో పుట్టాడు. ఈ బుజ్జి కృష్ణుడి రాకతో నందమూరి ఇంట మరింత సంతోషం నిండనుంది అనిపిస్తోంది. ఈ చిన్ని కృష్ణుడు ఎన్టీఆర్ ఆశలు పూర్తి చేసే అదృష్టాన్ని తీసుకుని వచ్చాడని అనుకోవటం అప్పుడే మొదలైంది.
ఎన్టీఆర్ కు సంబంధించి కుటుంబ నెలకొన్న అపార్థాలు తొలిగిపోవచ్చనే ఆశలు అభిమానుల్లో కలుగుతున్నాయి. ఏ సమస్య అయినా కృష్ణుడి పేరు తలుచుకుంటే తీరిపోతుంది. అలాంటి కృష్ణుడి నక్షత్రంలో పుట్టిన ఈ బుజ్జి కృష్ణయ్య తండ్రి సమస్యలను దూరం చేసే అదృష్టాన్ని తీసుకువచ్చాడనే నమ్ముతున్నారు ఆయన అభిమానులు.