ఐపీయల్ లో ఎన్టీఆర్ సందడి
on Mar 27, 2018
టీవీ ప్రేక్షకులని మెప్పిస్తే, ఎలాంటి ఫలితాలు రాబట్టొచ్చో ఎన్టీఆర్ కు బాగా అర్ధమయినట్టుంది. బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ పుణ్యామా అని, నెగటివ్ టాక్ తో కూడా జై లవ కుశ సూపర్ హిట్టయింది. బిగ్ బాస్ 2 కి కూడా ఎన్టీఆర్ ని అనుకున్నప్పటికీ, బిజీ షెడ్యూల్స్ మూలంగా నో చెప్పాడు. అయితే, స్టార్ టీవీ వాళ్ళు మటుకు, ఎన్టీఆర్ తో బంధం తెంచుకునే ఉద్దేశ్యంలో లేనట్టు కనపడుతుంది. రానున్న ఐపీయల్ కొత్త సీజన్ కి ఎన్టీఆర్ ని తెలుగు ప్రచార కర్తగా తీసుకున్నారట. ప్రోమోస్ కి షూట్ చేస్తే సరిపోతుంది కాబట్టి ఎన్టీఆర్ కూడా వెంటనే ఓకే చెప్పాడట. ప్రో కబడ్డీ తరహాలో ఐపీయల్ కూడా తెలుగు కామెంటరీ తో ప్రసారమవనుందట. ఈ ఛానల్ కి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాజిడర్ గా వ్యవహరించనున్నాడు. క్రికెట్ మధ్యలో ఎన్టీఆర్ ప్రోమో వేయనున్నారు. సో, ఈ ఐపీయల్లో ఎన్టీఆర్ క్రికెట్ అభిమానుల్ని అలరించనున్నాడు. ఇంకో పక్క, తెలుగు క్రికెట్ అభిమానులకి తెలుగులో కామెంటరీ వినడం థ్రిల్లింగ్ విషయం అయితే, మధ్య మధ్యలో ఎన్టీఆర్ ని చూడటం అడిషనల్ కిక్.