తాత పాత్రకి మనవడు... సావిత్రి ఆత్మకథలో ఎన్టీఆర్...
on Jun 22, 2017
బాలకృష్ణ సినిమాలు, రాజకీయాలతో బిజీ గా ఉన్నారు. తన పుత్ర రత్నం మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇవ్వగానే తాను ఇండస్ట్రీ కి వీడ్కోలు చెబుతానని బాలకృష్ణ ఇంతకు ముందే చెప్పడం జరిగింది. అయితే, ఈ లోపల తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆత్మకథని సినిమాగా తీస్తానని అనౌన్స్ చేసాడు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలో మిగతా విషయాలు వెల్లడిస్తానని చెప్పాడు.
అయితే, ఎన్టీఆర్ పాత్రని బాబాయ్ కంటే ముందే చేసే అవకాశం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి వరించింది. తాజా సమాచారం ప్రకారం, నిర్మాత అశ్విని దత్ కూతురు స్వప్న దత్ తన భర్త నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సావిత్రి బయోపిక్ మహానటి లో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర చేయడం విషయంలో తన మిత్రుడు జూనియర్ ఎన్టీఆర్ ని సంప్రదించడం జరిగింది. ఇంతకన్నా అదృష్టమా అని మన జూనియర్ కూడా ఓకే చేసాడని వినికిడి. అయితే, ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాత పోలికలు పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ నిజంగా పెద్దాయన పాత్ర చేస్తే మహానటి సినిమాకి ఒక కొత్త శోభ వస్తుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో సమంత ఒక ముఖ్యమయిన క్యారెక్టర్ చేస్తుంది. వీరే కాకుండా ఇంకొందరు ప్రముఖ నటుల్ని ఈ సినిమాలో నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది.