నైట్ పార్టీలో శ్రీదేవి కూతురు అరాచకం
on Feb 19, 2017
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి బాగా పాపులర్. ఒక్క సినిమా కూడా చేయలేదు గానీ.. సినిమా వార్తల్లో, గాసిప్పుల్లో తన పేరు తరచూ వినిపిస్తూనే ఉంటుంది. ఫ్యాషన్ షో డ్రస్సింగ్కి ఏమాత్రం తగ్గనట్టు డ్రస్సులు వేసుకొని ఊరిస్తుంటుంది. దాంతో పాటు వీకెండ్ అయితే చాలు... ముంబై పార్టీల్లో, పబ్బుల్లో జాహ్నవి ఎంట్రీ తప్పనిసరి. పైగా ఇప్పుడో ప్రేమ వ్యవహారం కూడా నడుపుతున్నట్టు బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకొంటున్నాయి.
ఇటీవల ఓ నైట్ పార్టీలో అక్షత్ రాజన్ అనే కుర్రాడితో చిందులు వేస్తూ కనిపించింది. నైట్ క్లబ్లో వీరిద్దరే సెంట్రాఫ్ అట్రాక్షన్. వీరిద్దరి ఫొటోలూ ఆన్లైన్లో హల్ చల్ చేయడం మొదలెట్టాయి. అవి... శ్రీదేవి, బోనీకపూర్లకూ చేరాయి. వాళ్లయితే ఈ వ్యవహారాన్ని వీర లైట్ తీసుకొంటున్నారు. జాహ్నవి విషయంలో ఇదంతా మామూలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. జాహ్నవి ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలుసని, వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని, అందుకే.. ఇంతలా రెచ్చిపోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి శ్రీదేవి మనసులో ఏముందో, ఏంటో??
Also Read