English | Telugu

టార్గెట్ మిస్ అయిన జవాన్ రివ్యూ

on Dec 1, 2017


తారాగణం:- సాయిధరమ్ తేజ్, ప్రసన్న, మెహ్రీన్...
దర్శకత్వం:-  బీవీఎస్ రవి
నిర్మాత:-  కృష్ణ

అబిమాన హీరో సినిమా విడుదల రోజున ఫ్యాన్సందరూ  టపాసులు కాల్చి హంగామా చేయడం రివాజు. ఆ సినిమా హిట్ అయినా.. ఫట్ అయినా వీరి ఆనందహేల.. గోల కామనే. ఈ హంగామా చూసినోళ్లంరూ ’వామ్మో... ఇంకేముంది.. సినిమా పెద్ద హిట్టయ్యుంటుంది’.. అనేసుకుంటారు. మోసపోయామని తర్వాత తెలుసుకుంటారనుకోండీ.. అది వేరే విషయం. కొన్ని దశాబ్దాలుగా  ఈ అధ్యాయం మాత్రం చర్విత చరణం.

గురువారం మెగా మేనల్లుడి ‘జవాన్’ సినిమా విడుదలైంది. తొలి షో పూర్తయ్యిందో లేదో.. అబ్బబ్బబ్బా.. ఏం కాలుస్తున్నారండీ బాబూ టపాసులు. వారి హంగామా చూసిన ఎవరైనా... హిస్టారికల్ హిట్ అనే నిర్ణయానికొచ్చేస్తారు. మరి మేగా మేనల్లుడా మజాకా. ‘మెగా’ అనే బ్రాండ్ ఉంటే చాలు... ప్యాక్డ్ గా ఫ్యాన్స్ రెడీ. ఆ కాంపౌండ్ హీరోలు పెద్దగా కష్టపడవసరం లేని పరిస్థితి. అంతా చిరంజీవిగారి పుణ్యం ఏమంటారు..!

ఇంతకీ వీరి హంగామా వెనుక దాగున్నది నిజమైన ఆనందమేనా? లేక బాధలోంచి పుట్టకొచచిన ఉక్రోషంలోంచి పుట్టుకొచ్చిన... వేదనలోంచి పుట్టుకొచ్చిన... విరక్తిలోంచి పుట్టకొచ్చిన... అదేదో తెలీని తనమా? తెలుసుకోవాలంటే...ముందు కథలోకెళ్దాం.

కథ:-

హీరో, విలను... వీరి చిన్నతనం నుంచి కథ మొదలవుతుంది. పసి వయసు నుంచే హీరో నిజాయితీపరుడు. ఇక విలన్ అంటే షరా మామూలే కదా. కుళ్లు, కుచితం, ఈర్ష్యా, ద్వేషం, దొంగతనం, టెంపరితనం, వెధవతనం... అన్నీ కలగలిసి ఉంటాడు. మళ్లీ ఇద్దరూ స్నేహితులు. ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు... ప్రతి విషయంలోనూ హీరోతో పోల్చి విలన్ ని తిడుతుంటారు... కొడుతుంటారు. మనోడికి ఇంటర్నల్ గా హీరోపై కుళ్లు పెరుగుతూ ఉంటుంది. వాడ్ని కూడా పొల్యూట్ చేయడానికి  చూస్తాడు. దాంతో స్కూల్లో టీసీ ఇచ్చేసి పంపిస్తారు. ఇక చేసేది లేక... వాళ్ల నాన్న ఆ ఊరు నుంచే వాడ్ని తీసుకెళ్లిపోతాడు. కాలం.. ఓ 20 ఏళ్లు గిర్రున తిరిగింది. ఇద్దరూ చెరోచోట పెరుగుతారు. ఇప్పుడు హీరోగారి లక్ష్యం... డిఫెన్స్ రీసెర్చ్ డవలెప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో)లో ఉద్యోగం సంపాదించడం. దాని కోసం ప్రయత్నిస్తుంటాడు. విలనేమో.. సంఘ విద్రోహశక్తిగా మారతాడు. చివరకు ఉగ్రవాదులతో కూడా చేతులు కలిపుతాడు. దేశ రక్షణ కోసం డీఆర్డీవో తయారు చేసిన అత్యంత శక్తిమంతమైన ‘అక్టోపస్’ అనే మిస్పైల్ ని ఉగ్రవాదులకు అప్పగించడానికి 500 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఈ ప్రమాదం నుంచి దేశాన్ని హీరో ఎలా కాపాడాడు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:-

హీరో, విలన్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు అవ్వడం అనేది పాత ఎన్టీయార్ సినిమాల నుంచీ వస్తున్న ఫార్ములానే. ప్రభుత్వం ఓ మిస్సైల్ కనుక్కోవడం... దాన్ని ఉగ్రవాదులు కాజేయడానికి చూడటం.. హీరో దాన్ని కాపాడుకోవడం... ఇదంతా ఎప్పటి కథండీ బాబూ.  అయితే.. ఈ కథను కొత్తగా చూపించకపోయినా... చెత్తగా మాత్రం చూపించలేదనే చెప్పాలి. కథ రిత్యా...  హీరో, విలన్.. ఇద్దరూ క్యాట్ అండ్ ర్యాట్ పంథాలో ఎత్తులు పైఎత్తులు వేసుకుంటుంటారు.  ఇంటలిజెంట్ స్క్రీన్ ప్లే అనమాట.

ఇక సాయిధరమ్ తేజ్. చక్కగా చేశాడు. మెహ్రీన్... తన అందంతో సినిమాను బాగా అలంకరించింది. విలన్ ప్రసన్న... చాలా బాగా చేశాడు. మిగిన వారందరూ కూడా ఉన్నంతలో ఫర్వాలేదనిపించేశారు.

ఇక సాంకేతికత విషయానికొస్తే... తెలుగు సినిమా సంగీతానికి ఓ బ్యాక్టీరియాలా తయారయ్యాడు ఈ తమన్. పాటల్లో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. నేపథ్య సంగీతం కూడా గోల గోల. కెమెరా వర్క్ కూడా సో..సో గా ఉంది. ఎడిటింగ్ బావుంది. అలాగే... బీవీఎస్ రవి డైలాగులు బాగా రాసుకున్నాడు. దేశభక్తిపై వచ్చే డైలాగులు ఆలోచింపజేస్తాయ్.  

మొత్తం మీద... సినిమా ఒకే... అభిమానులు ఎలాగూ రెండో సారి కూడా వెళ్తారనుకోండి.

రేటింగ్: - 2.5


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here