మరాఠా యోధుడిగా జగపతిబాబు...!
on Sep 5, 2018
అజయ్ దేవగన్ 'తానాజీ' అనే చిత్రంలో నటిస్తున్నారు. మరాఠా వీరుడు సుబేదార్ తానాజీ మలుసరే జీవితం ఆధారంగా దర్శకుడు ఓ రౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఆర్టిస్టిక్ పోస్టర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంత్యంత భారీ బడ్జెట్ తెరకెక్కుతున్న హిస్టారికల్ చిత్రం 'తానాజీ' లో జగపతి బాబు ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. జగపతి బాబు పాత్ర డీటెయిల్స్ బయటకు రాలేదు కానీ తన పాత్ర కోసం లుక్ టెస్ట్ చేసిన ఫొటో బయటకు వచ్చింది. మెలితిప్పిన మీసాలు - నెరిసిన గుబురు గడ్డంతో- నారింజ రంగు తలపాగా ధరించి మరాఠా యోధుడిగా వున్న జగపతిబాబు లుక్ అదిరిపోయింది. ఇక ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ సరసర దాదాపు 9 సంవత్సరాల తర్వాత కాజోల్ హీరోయిన్గా నటిస్తోంది. వయకామ్ 18 మోషన్ పిక్చర్ వారు ఈ సినిమాను ఓం రౌత్ డైరెక్టర్ లో తెరకెక్కిస్తున్నారు.