ఇస్మార్ట్ పూరి... కొత్తగా ఏముంది?
on May 15, 2019
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పుట్టినరోజు ఈ రోజు (బుధవారం, మే 15). ఆయన నటిస్తున్న తాజా సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. రామ్ బర్త్ డే స్పెషల్‌గా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు దర్శకుడు కమ్ నిర్మాత పూరి జగన్నాథ్. టైటిల్‌కి తగ్గట్టు శంకర్ ఇస్మార్ట్ ఆ? కదా? అనేది ఇప్పుడే చెప్పలేం కానీ... పూరి మాత్రం ఇస్మార్ట్ అనే చెప్పాలి. కొత్తదనం లేకుండా సేమ్ క్యారెక్టరైజేషన్‌తో కొత్త హీరోలను తన కథలతో ఒప్పిస్తున్నందుకు. ట్రైలర్‌కి తక్కువ... టీజర్‌కి ఎక్కువ అన్నట్టు నిమిషం కంటే ఎక్కువ నిడివితో కట్ చేసిన 'ఇస్మార్ట్ టీజర్'లో రామ్ క్యారెక్టరైజేషన్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి వాడుకున్నాడు పూరి. తన ప్రతి సినిమాలో హీరోలకు కొత్త మేకోవర్ ఇచ్చే పూరి, ఈ సినిమాలో రామ్‌కి మేకోవర్ ఇచ్చాడు. రొటీన్ పూరి మార్క్ మినహా అందులో కొత్తదనం ఏమీ లేదు. తన యాక్టింగ్, ఎనర్జీతో చూడబుల్ గా చేశాడు రామ్. సూపర్ స్టెప్పులు కూడా వేశాడు. హైదరాబాదీ యాసలో రామ్ డైలాగ్ డిక్షన్ వినడానికి కాస్త ఇబ్బంది ఉంది. 'మార్ ముంత... చోడ్ చింత', 'నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముంగిట పొట్టేలును కట్టేసినట్టే'... ఈ డైలాగుల్లోనూ రొటీన్ పూరి మార్క్ తప్ప కొత్తదనం ఏమీ లేదు. సినిమా ఎలా ఉంటుందో మరి?