పవన్‌కి ఆ టైటిల్ సెట్ అవుతుందా?
on Feb 12, 2020
ఇండస్ట్రీలో లీకులు భలే గమ్మత్తుగా ఉంటాయి. ముఖ్యంగా టైటిల్స్ విషయంలో! స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ సెట్ అవుతాయా? లేదా? అనే సందేహం వచ్చినప్పుడు ముందుగా లీకులు ఇస్తారు. ఉదాహరణకు... పవన్‌కల్యాణ్ ‘పింక్’ రీమేక్‌కు ‘వకీల్ సాబ్’ టైటిల్ రిజిస్టర్ చేయించారు. అసలు, ఆ టైటిల్ అనుకున్నప్పుడు పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ముందుగా లీకులు ఇచ్చారు. మెజార్టీ ఆడియన్స్, పవన్ ఫ్యాన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసరికి ఫిక్స్ చేశారు. అంతకంటే పవర్ఫుల్ టైటిల్ ఇంకొకటి వస్తే అప్పుడు ఆలోచిస్తారు. ‘పింక్’ రీమేక్‌లో పవన్ లాయర్ రోల్ చేస్తున్నాడు కాబట్టి ఆ టైటిల్ ఫిక్స్ అనుకోవచ్చు.
‘పింక్’ రీమేక్ కాకుండా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జానపద జానర్లో బందిపోటు క్యారెక్టరైజేషన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘విరూపాక్ష’ టైటిల్ అయితే ఎలా ఉంటుందని క్రిష్ ఆలోచిస్తున్నార్ట. అందుకని, లీకులు ఇచ్చారు. ‘వకీల్ సాబ్’ సౌండింగ్లో ఒక పవర్ ఉంది. ‘విరూపాక్ష’ సౌండింగ్లో అంత పవర్ ఎక్కడుంది? అందులోనూ పవర్‌స్టార్ ఇమేజ్‌కి ఆ టైటిల్ ఎలా సెట్ అవుతుంది? అనే సందేహాలు చాలామంది వ్యక్తం చేశార్ట. అయితే... క్రిష్ తెలివిగా ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇదొక ఆప్షన్ మాత్రమే అని చెప్పార్ట. ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే... కోహినూర్ కొట్టేయడానికి ప్రయత్నించే బందిపోటుగా పవన్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఆల్రెడీ 10 డేస్ షూటింగ్ చేశారు. ‘పింక్’ రీమేక్ పూర్తయిన తర్వాత మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘యన్‌టిఆర్ – కథానాయకుడు’, ‘యన్‌టిఆర్ – మహానాయకుడు’... ఇలా క్రిష్ టైటిల్స్ అన్నీ సాఫ్ట్‌గా ఉంటాయి. చివరికి, ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో?