`ఇండియన్-2` షూటింగ్ ఎప్పుడంటే!!!
on Nov 30, 2018
`2.0` చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో దర్శకుడు శంకర్ రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాడు. త్వరలో 22 ఏళ్ల క్రితం కమల్‌హాసన్ తో తెరకెక్కించిన `భారతీయుడు` చిత్రానికి సీక్వెల్ గా `ఇండియన్-2` చేస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అయితే ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ ఆర్ ఎఫ్ సిలో ప్రారంభం కానుందట. ఈ చిత్రాన్ని తెలుగులో `భారతీయుడు-2` పేరుతో విడుదల చేయనున్నారు.
కమల్ హాసన్ ఓల్డ్ గెటప్ కోసం హాలీవుడ్ కి సంబంధించిన కొంత మంది మేకప్ మేన్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల టెస్ట్ కూడా పూర్తయిందట. ఈ సినిమా పక్కా ప్లానింగ్ ప్రకారం జరిగేలా ఎటువంటి ఆలస్యం జరక్కుండేలా కేర్ తీసుకుంటున్నాడట దర్శకుడు శంకర్. ఈ చిత్రంలో కాంటెపరరీ పొలిటికల్ అంశాలను చూపించనున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకోనున్నారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. దుల్కర్, శింబులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారట. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ తో నెగిటివ్ రోల్ చేయించడానికి శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.