Home

»

Latest News

నాగార్జున, అనుష్క, రవితేజలపై ఐటి రైడ్స్

Mar 23, 2011 12:23PM

Nagarjuna photos, Nagarjuna pics, Nagarjuna images, Nagarjuna wallpapers, Nagarjuna stills, Nagarjuna picturesనాగార్జున, అనుష్క, రవితేజలపై ఐటి రైడ్స్ జరుగుతున్నాయి. మార్చ్ 23 వ తేదీ ఉదయం నుండీ యువ సామ్రాట్, కింగ్ అక్కినేని నాగార్జున, అందాల యోగా టీచర్ అనుష్క, మాస్ మహరాజా హీరో రవితేజ ఇళ్ళపై ఏక కాలంలో ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్దాడులు నిర్వహిస్తోంది. అంతే కాకుండా హీరో నాగార్జున అన్నగారైన అక్కినేని వెంకట్ ఇంటిపై కూడా ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు చేస్తున్నారు. అలాగే నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టుడియోలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.

 

అంతే కాక కేవలం నాగార్జుతోనూ, ఆయన కుమారుడుNagarjuna photos, Nagarjuna pics, Nagarjuna images, Nagarjuna wallpapers, Nagarjuna stills, Nagarjuna pictures నాగచైతన్యతోనూ మాత్రమే సినిమాలు నిర్మించే కామాక్షీ కళా మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత డి.శివప్రసాద రెడ్డి ఇంటిపై కూడా ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులన్నీ ఒకేసారి ఆదాయపు పన్ను శాఖాధికారులు నిర్వహించటం విశేషం. ఈ ఆదాయపు పన్ను శాఖాధికారుల దాడులకు కారణంగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది.

 

ప్రముఖ నిర్మాత, లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ సంస్థ అధినేత బెల్లంకొండ సురేష్ ద్వారా మన సినీ నటీ, నటులందరూ విశాఖపట్టణంలో భూమిని కొనటం వల్ల వారి మీద ఈ ఆదాయపు పన్ను శాఖాధికారుల దాడులు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com