జమ్మూలో పండుకు అస్వస్తత
on Feb 23, 2014
"నిన్నే పెళ్ళాడుతా" సినిమాలో "పండు" గా కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన బాలీవుడ్ హీరోయిన్ టబు ఇటీవలే హాస్పిటల్ లో చేరింది. ప్రస్తుతం టబు హిందీలో "హైదర్" అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ జమ్ముకాశ్మీర్ లో జరుగుతోంది. చలి తీవ్రత మైనస్ డిగ్రీలలో ఉండటంతో భరించలేకపోయింది. వెంటనే బోన్ ఫైర్ దగ్గరికి వెళ్ళింది. కానీ అందులోనుంచి వచ్చే పొగ ఆమెను ఊపిరి అడనివ్వకుండా చేయడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. దాంతో వెంటనే చిత్ర యూనిట్ సిబ్బంది ఆమెను హాస్పిటల్ కు తరలించారు. చికిత్స చేసిన డాక్టర్లు పెద్దగా ప్రమాదం ఏమి లేదని చెప్పి, ఆమెను డిశ్చార్జ్ చేసారు.