వివాదానికి దూరంగా... ఫ్యామిలీకి దగ్గరగా రవితేజ
on Sep 9, 2019
'ఆర్.ఎక్స్. 100' దర్శకుడు అజయ్ భూపతి 'చీప్ స్టార్' అని చేసిన ట్వీట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ హాట్ టాపిక్. రవితేజను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ, అజయ్ భూపతి వాటికి వివరణ ఇవ్వడం లేదు. 'మహా సముద్రం'లో రవితేజ నటించడం లేదని స్పష్టం చేశారు. ఎందుకు? ఏమిటి? అనే కారణాలు తాను వెల్లడించలేనని అంటున్నారు. రెమ్యునరేషన్ దగ్గర రవితేజ బెట్టు చేయడంతో సినిమా ఆగిందని ఇండస్ట్రీ గుసగుస. ఇటీవల వచ్చిన మాస్ మహారాజా సినిమాలు ఏవీ సరైన విజయాలు సాధించకున్నప్పటికీ... ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని ఆ గుసగుస సారాంశం. ఈ వివాదం గురించి ఆరా తీయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. రవితేజను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన మాత్రం ఈ వివాదానికి దూరంగా, ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి రవితేజ గోవా వెళ్లారు. పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అసలు, ఈ వివాదాన్ని ఆయన పట్టించుకున్నట్టు లేరు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
