English | Telugu

'జెర్సీ' ఎప్ప‌టికీ పాత‌బ‌డిపోదు-నాని

on Apr 23, 2019

 

ప్ర‌జంట్ ప్ర‌తి ఒక్క‌రూ `జెర్సీ` సినిమా గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా నాని యాక్టింగ్ గురించి తెగ పొగిడేస్తున్నారు. విడులైన అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ తో  దూసుకెళ్తోంది. ఈ సినిమా చూసి విప‌రీతంగా న‌చ్చిన హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు జెర్సీ టీమ్ ని అప్రిషియేట్ చేయ‌డానికి ఏర్పాటు చేసిన మీట్ లో నాని మాట్లాడుతూ...` స్టోరి విన్న‌ప్పుడే నాకు అద్భుతంగా అనిపించింది. సినిమాలో అర్జున్ కి బిసిసిఐ ఈవెంట్ ప్లాన్ చేసిన‌ట్లు, దిల్ రాజు గారు ఈ అప్రిషియేష‌న్ మీట్ ను ఏర్పాటు చేసారు. ఆయ‌న మంచి సినిమా వ‌చ్చిన‌ప్పుడు చాలా ఎంక‌రేజ్ చేస్తారు. రిలీజ్ రోజు దిల్ రాజు గారు ఫోన్ చేసారంటే ఆ సినిమా హిట్ అయిన‌ట్టే.  గౌత‌మ్ హానెస్ట్ ప‌ర్స‌న్. మ‌న మ‌న‌సులో నుంచి వ‌చ్చిన జెన్యూన్ స్టోరీ అయితే త‌ప్ప‌కుండా మేజిక్ క్రియేట్ చేస్తుందని నమ్ముతాను. గౌత‌మ్ చాలా పెద్ద డైర‌క్ట‌ర్ అవుతాడు. నాలో అర్జున్ ని చూసిన గౌత‌మ్ కి చాలా థ్యాంక్స్.  ఇలాంటి క‌థ‌ను నమ్మి తీయాలంటే నిర్మాత‌లు గ‌ట్స్ కావాలి. వంశీ చాలా న‌మ్మి సినిమా తీసాడు. మా టీమ్ అంతా పూర్తి ఎఫ‌ర్ట్ పెట్టారు. స‌త్య‌రాజ్ గారితో యాక్ట్ చేయడం చాలా హ్యాపీ. టీమ్ అంతా ప్రేమ‌తో సినిమా చేసారు. కాన్ఫిడెంట్ గా చెబుతున్నా మ‌న‌మంతా పాత‌బ‌డిపోవ‌చ్చు కానీ, జెర్సీ ఎప్ప‌టికీ పాత‌బ‌డిపోదు`` అన్నారు.


Cinema GalleriesLatest News


Video-Gossips