మహేష్‌ని మైమరపించిన అఖిల్
on Dec 22, 2017
మొదటి సినిమా అఖిల్ నిరాశపరచడంతో కాస్త బ్రేక్ తీసుకున్న అక్కినేని అఖిల్, తన రెండవ సినిమా హలో తో ఈ రోజు ప్రేక్షకులని పలకరించడానికి వచ్చాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన కథానాయిక గా చేసింది. దర్శకుడు విక్రమ్ హలో ని ఎలా తీసాడు... రిజల్ట్ ఎలా ఉండబోతుంది... అనే విషయాలు పక్కన పెడితే, మూవీ చూసిన వారందరూ అఖిల్ అద్భుతంగా చేసాడు అని కితాబిస్తున్నారు. లుక్స్ లో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ని మైమరపిస్తున్నాడని, విమర్శకులు సైతం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇక నటన విషయానికి వస్తే, రెండో సినిమాకే చాలా మెచూరిటీ చూపించాడు. ఎమోషనల్ సీన్స్ లో, లవ్ సీన్స్ లో తన హావభావాలతో ఆకట్టుకున్నాడు. ఇక డాన్స్ లు, ఫైట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డూప్ లేకుండా చేసిన చాలా ఫైట్స్ వారెవ్వా అనిపించక మానవు. అలా అని చెప్పేసి మోతాదుకు మించి ఏం చేయలేదు. ఎంత వరకు చేయాలో అంతవరకు చేసి, సినిమా పట్ల తన డెడికేషన్ నిరూపించుకున్నాడు. సో, అక్కినేని వంశం నుండి కుటుంబాన్ని ఉద్ధరించే హీరో అఖిల్ రూపంలో వచ్చాడని చెప్పొచ్చు. మంచి కథలు ఎన్నుకుంటే, త్వరలోనే స్టార్ స్టేటస్ అందుకుంటాడు. అల్ ది బెస్ట్ అఖిల్!