హలో గురు ప్రేమకోసమే.. మరో 'నేను శైలజ'
on Oct 10, 2018
'స్కూల్ అయినా, కాలేజ్ అయినా, ఆఫీస్ అయినా.. జాయిన్ అయిన ఫస్ట్ డే అందరూ చేసే ఫస్ట్ పనేంటో తెలుసా? అమ్మాయిల్లో ఎవరు బాగున్నారని అబ్బాయిలు, అబ్బాయిల్లో ఎవరు బాగున్నారని అమ్మాయిలు ఏరుకోవడం' అని ఎనర్జిటిక్ హీరో రామ్ హితబోధ చేస్తున్నాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'హలో గురు ప్రేమకోసమే'. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘పొద్దున్నే సంజుగాడు ఎక్కడికెళ్లాడే’ అని పోసాని కృష్ణమురళి తన భార్యను అడిగే సీన్తో ట్రైలర్ మొదలవుతుంది. ఒకవైపు రామ్ ఎనర్జీ, మరోవైపు దేవిశ్రీ మ్యూజిక్ తో ట్రైలర్ బాగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే 'నేను.. శైలజ' లో లవ్ అండ్ కామెడీతో ఆకట్టుకున్న రామ్ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడు అనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రామ్ కి ఫ్రెండ్ లా కనిపించడం విశేషం. ప్రకాష్ రాజ్, రామ్ ల మధ్య కామెడీ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ చూసాక డైలాగ్స్ గురించి కూడా కచ్చితంగా మాట్లాడుకుంటారు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 'హలో గురు ప్రేమకోసమే' ట్రైలర్ బ్యూటిఫుల్ లవ్, కూల్ కామెడీతో హ్యాపీగా సాగిపోయింది.