హలో... ‘యమా హాట్‌గా వుంది’ గురూ!
on Sep 18, 2018
హాట్‌గా వుంది... హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కూర్చున్న ఫోజు! హీరో రామ్ ఆమెను చూస్తున్న తీరు! అంతేనా? అంతకు మించి హాట్‌గా ఉన్నాయి.... డైలాగుల్లోని డబుల్ మీనింగ్! సాధారణంగా డబుల్ మీనింగ్ అంటే వల్గర్ అని అనుకుంటారంతా. కాని ఇక్కడ మాత్రం రొమాంటిక్. హీరో మాటల్లో డబుల్ మీనింగ్ డైలాగులు చాలా రొమాంటిక్ ఫీల్ ఇచ్చాయి. రామ్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న సినిమా ‘హలో గురూ ప్రేమ కోసమే’. ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’ విజయాల తర్వాత త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు. సోమవారం సాయంత్రం టీజర్ విడుదల చేశారు. అందులో కుర్రకారుకి కైపెక్కించే హీరోయిన్ భంగిమ, డైలాగులు అట్రాక్టివ్‌గా వున్నాయి. చాలా ఫ్రెష్‌గా వుందీ టీజర్. ఈ సినిమాను ఆక్టోబర్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు!!
Also Read