శ్రీదేవి పాత్రలో.. హెబ్బా పటేలా? హతవిధీ...!
on Aug 8, 2017
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాను ప్రేక్షకులు తేలిగ్గా మరిచిపోగలరా? ఓ అందమైన ఊహకు తెర రూపాన్నిస్తూ... కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన వెండితెర అద్భుతం ఆ సినిమా. ఆ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉంది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లో కొత్త పాయింట్ ఏంటంటే... దేవకన్య భూలోకంలోకి అడుగుపెట్టి సామాన్యులతో కలిసి బతకడం. ఈ పాయింటే జనాలకు అప్పట్లో తెగ నచ్చేసింది. ఇప్పుడొచ్చినా నచ్చుతుందని చాలామంది అభిప్రాయం కూడా. అందుకేనేమో... మొత్తంగా కాకుండా ఆ పాయింట్ వరకూ కాపీ కొట్టేసి సినిమా తీసేశాడు రాజమౌళి శిష్యుడు పళణి.నాగ అన్వేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో దేవకన్యగా హెబ్బా పటేల్ నటించింది. భువన్ సాగర్ నిర్మాత. ఆ ఒక్క పాయింట్ తప్ప సినిమా కథంతా వేరేగా ఉంటుదని చెబుతున్నాడు పళని. ఇందులో ఓ 40 నిమిషాల గ్రాఫిక్స్ కూడా ఉంటాయట. సినిమా బావుంటుందని నమ్మకంగా చెబుతున్నాడు పళని. ఏది ఏమైనా... ఆ చిరంజీవి ఎక్కడా!.. ఆ శ్రీదేవి ఎక్కడ! ... అసలు దేవకన్య ఎలా ఉంటుందో కళ్లకు కట్టేసింది శ్రీదేవి. అతిలోక సుందరి వేసిన పాత్రను హెబ్బ పటేల్ వేయడమేంటి? విడ్డూరం కాకపోతే... హతవిధీ...!