తేజ రీల్ లైఫ్ హిట్స్... రియల్ లైఫ్ ఫ్లాప్స్....
on Feb 21, 2019
తెలుగు సినీ దర్శకులు తేజ గారికి జన్మదినశుభాకాంక్షలు తెలియజేస్తూ...సినీ ప్రేక్షకులందరికీ తన సినిమాలతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇవ్వటమే కాకుండా ఎంతోమంది నూతన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలిచ్చిన తేజగారి గురించి ప్రేక్షకులందరికీ తెలియజేయాలన్నదే మా ఈ ప్రయత్నం.
1966 పిబ్రవరి 22 వ తేదీన జన్మించిన ధర్మతేజ చిన్ననాడే అమ్మ చనిపోవటంతో నాయనమ్మ పర్వతవర్ధనమ్మగారి పర్యవేక్షణలో పెరిగారు. తండ్రి వ్యాపారం కూడా సరిగా జరగక నష్టాలు రావటంతో తేజగారు బంధువుల ఇళ్ళలో గడుపుతూ బతుకు తెరువుకోసం ఎక్కడ ఏ పని ఉంటే ఆపని చేస్తూ కాలం గడిపేవాడు. అలా సినిమా ఆఫీసుల్లో పనిచేస్తూ..చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చాక కొద్దిరోజులు పోస్టర్ ఇన్ చార్జ్ గా పనిచేసారు. తేజగారి లో టాలెంట్ చూసి టి.క్రిష్ణగారు ఆయనకి ఆసటనిచ్చారు. తర్వాత కెమెరా రంగం పట్ల ఆసక్తిపరులై రవికాంత్ నగాయచ్ గారు, ఎస్.గోపాలరెడ్డిగారు, మహీధర్ గారి దగ్గర సహాయకుడిగా పనిచేసేవారు.అలా రామ్ గోపాల్ వర్మగారితో పరిచయం ఏర్పడి ఆయనతో శివ సినిమాకు అనేక భాగాలలో పనిచేశారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాత్రి సినిమాకి ఛాయాగ్రాహకుడిగా రంగప్రవేశం చేశారు.అది మొదలు వరసగా ఆ బ్రుందంతో అంతం, మనీ సినిమాలకు పనిచేశారు. తేజ ఛాయాగ్రహణం అద్భుతంగా ఉండటంతో అటు హిందీలో ఎన్నో సినిమాలకు కెమెరామ్యాన్ గా చేశారు.
శివ, రంగీలా , బాజీ , మనీ , గులాం, సంఘర్ష్, అప్యా నా ప్యార్ కా...విశ్వ విధేత...మేళ.....తేరేమేరే సప్నే...రక్షన్... రక్షణ....జిస్ దేశ్ మే గంగా బహతే హై....ఫ్రెం....ది డాన్.... సౌగంధ్ ..ఖిలాడి....దీవార్....రాజా హిందుస్తానీ...దిల్ తో పాగల్ హై....సర్పరోష్....విలన్...జంజీర్ పితా...సినిమాలు ఛాయా గ్రాహకుడిగా చేశారు. అలా చిత్రీకరణ చేస్తూ...రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ చేస్తూ....రామోజీరావుగారిని కలిసి తను దర్శకత్వం చేస్తానని కధ చెప్పటం...దానికి రామోజీరావుగారి అంగీకరింపజేసి... కొత్త నటీనటులు...ఉదయ్ కిరణ్ హీరోగా...రీమాసేన్ హీరోయిన్ గా...ఆర్.పి.పట్నాయక్ సంగీతం, కులశేఖర్ గీత రచనతో...చిత్రం సినిమా తీసి ఇండస్ట్రీని ఒక ఊపుఊపారు. అది మొదలు కొత్త నటీనటులకుసాంకేతిక నిపుణులకు ప్రాధన్యమిస్తూ....నువ్వునేను ..జయం...చేసి తర్వాత హీరో మహేష్ బాబుతో నిజం...రాజేంద్ర ప్రసాద్ జగపతి బాబుల కాంబినేషన్ లో ఫ్యామిలీ సర్కస్ చేశారు. ధైర్యం ,జై, సంబరం, ఔనన్నాకాదన్నా, లక్ష్మీకల్యాణం, కేక, నీకునాకుడాష్ డాష్, 1000అబద్దాలు సినిమాలు తీశారు. కొత్తవారితో సినిమాలు తీసి ఇండస్ట్రీలో వండర్ స్రుష్టించి ఎంతోమందికి మంచి మార్గాన్ని సూచించిన తేజ ఇక మీద కూడా మళ్ళీ కొత్తవాళ్ళతో సినిమా తీసి అందరినీ అలరించటంతో పాటు మరికొంతమందికొత్తకళాకారులకి ఆపర్ ఇస్తారని ఆశిస్తూ...తేజగారికి జన్మదినశుభాకాంక్షలు.