చంద్రశేఖర్ యేలేటితో మూడవ సినిమా.. గోపీచంద్ క్లారిటీ
on Jul 6, 2018
చంద్రశేఖర్ యేలేటి.. తీసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రతి సినిమాలో వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.. ఆయన గోపీచంద్ తో రెండు సినిమాలు చేసారు.. అవే ఒక్కడున్నాడు, సాహసం.. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. దీంతో వీరి కలయికలో మూడో సినిమా ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. దీనికి తగ్గట్టే యేలేటి, గోపీచంద్ కలయికలో ముచ్చటగా మూడో సినిమా అంటూ వార్తలొచ్చాయి.. ఇంకేముంది ప్రేక్షకుల ఆసక్తి కాస్తా ఆనందంగా మారిపోయింది.. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.. అవన్నీ పుకార్లే ప్రస్తుతం యేలేటి దర్శకత్వంలో సినిమా ఏం చెయ్యట్లేదు అంటూ గోపీచంద్ క్లారిటీ ఇచ్చారు.. 'చంద్రశేఖర్ యేలేటితో మూడవ సినిమాకు స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు.. అసలు అలాంటి ఆలోచన తనకు లేదు.. ఇప్పటి వరకు చంద్రశేఖర్ గారు కూడా నన్ను కలిసి స్టోరీ లైన్ కూడా చెప్పలేదు.. లేని పోని పుకార్లు పుట్టించి వాటిని పబ్లిసిటీ చేయడం టైం వేస్ట్' అని గోపీచంద్ అన్నారు.