ఆఫీసులోనే కొట్టుకున్న నిర్మాతలు
on Jun 28, 2018
ఆ ఇద్దరూ నిర్మాతలూ కలిసి ఓ బ్రహ్మాండమైన సినిమా తీద్దామనుకున్నారు. ఓ అప్కమింగ్ కమేడియన్ను హీరోగా పెట్టి తాము అనుకున్న సినిమాని పూర్తిచేశారు. అది రేపే విడుదల కానుంది. ఇంతలో ఇద్దరి మధ్యా మనస్పర్థలు మొదలయ్యాయి. ఇద్దరిలో ఒకరు, సినిమా పేరుతో కావల్సినంత నొక్కేశాడని అవతలి నిర్మాతకు తెలిసింది. అంతే ఈ విషయమై మాటామాటా పెరిగింది. ఆ మాటలు చివరికి చేతలు దాకా వెళ్లాయి. ఆఫీసులోనే కొట్టుకునేంత వరకూ గొడవ పెరిగింది. దాంతో ఆఫీసు కాస్తా రణరంగంగా మారిపోయింది. ఈ వ్యవహారం చివరికి పోలీసుల దాకా వెళ్లే అవకాశం ఉందని సమాచారం. డబ్బు తినేసిన నిర్మాత మీద రెండో రెండో నిర్మాత ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇంతకీ ఆ ఇద్దరు నిర్మాతూ ఎవరు, కమేడియన్ హీరోగా నటిస్తున్న ఆ చిత్రం ఏమిటి మీరే ఊహించుకోండి మరి!