రాజశేఖర్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌కి దర్శకుడు ఎవరో తెలుసా??
on Jul 18, 2019
టాలీవుడ్ యాంగ్రీ హీరో ఎవరంటే వెంటనే మనం రాజశేఖర్ అని చెబుతాం. అందుకు ఆయన చేసిన అంకుశం, ఆగ్రహం, మగాడు, అహంకారి, అంగరక్షకుడు లాంటి సినిమాలు ఉదాహరణలు. ఇలాంటి క్రమంలో కె.రాఘవేంద్రరావు `అల్లరి ప్రియుడు` లాంటి ఓ లవ్ ఎంటర్ టైనర్ రాజశేఖర్ తో చేసి సూపర్ హిట్ ఇచ్చారు. ఈ సినిమాలో రాజశేఖర్ తన కామెడీతో ప్రేక్షకులను అలరించాడు. ఇక కొంత కాలం వరుస ఫ్లాపులతో డీలా పడ్డ రాజశేఖర్ తో ప్రవీణ్ సత్తార్ `పియస్వీ గరుడవేగ` చిత్రం చేసాడు. ఈ చిత్రంలో రాజశేఖర్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫీసర్ గా నటించాడు. తన అద్భుతమైన నటనతో , ప్రవీణ్ సత్తార్ దర్శక ప్రతిభతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లో కి వచ్చాడు రాజశేఖర్. ఇటీవల చేసిన `కల్కి`లో కూడా రాజశేఖర్ నటుడుగా తన స్టామినా ఎంటో మరో సారి నిరూపించాడు.
ఇక ఇదిలా ఉంటే రాజశేఖర్ తదుపరి సినిమా ఏ దర్శకుడితో ఉంటుంది? అని ఆరా తీయగా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేమిటంటే... అల్లరి నరేష్ తో `అహనాపెళ్లంటా`, సునీల్ తో `పూలరంగడు` చిత్రాలు చేసి హాస్యభరితమైన చిత్రాలు చేయడంలో సిద్ధహస్తుడు అనిపించుకున్న వీరభద్రమ్ దర్శకత్వంలో రాజశేఖర్ తన తదుపరి సినిమా చేయనున్నాడట. నాగార్జునతో భాయ్, ఆది సాయికుమార్ తో `చుట్టాలబ్బాయి` చేసి తను హాస్యమే కాదు, యాక్షన్ చిత్రాలు కూడా చేయగలడు అనిపించుకున్న వీరభ్రమ్ మరి యాంగ్రీ హీరో రాజశేఖర్ తో ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అన్నది ఇప్పుడు అందర్నీ మెదులుతోన్న ప్రశ్న. గరుడవేగ, కల్కి రెండు సీరియస్ యాక్షన్ చిత్రాలతో మెప్పించిన యాంగ్రీ హీరో ఈసారి కామెడీ యాక్షన్ ఎంటర్ టైన్ చేయబోతున్నాడా? అసలు దర్శకుడు వీరభద్రమ్ ఎలాంటి స్క్రిప్ట్ తో ఈ సినిమా చేయబోతున్నాడు? ఆ సంగతులన్నీ తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.