`డిస్కో రాజా` ఆగిపోలేదు!!
on May 6, 2019
అవును ప్రజంట్ సోషల్ మీడియాలో ఉస్కో అంటే చాలు డిస్కో అంటున్నారు. ఒక్కరు ఏదైనా ఒక న్యూస్ స్ప్రెడ్ చేసారంటే చాలు దానికి ఉన్నవి లేనివి యాడ్ చేసి రాసేస్తున్నారని ఇటీవల చాలా మంది సినీ సెలబ్రిటీల వాదన. ఇక ఇటీవల `డిస్కోరాజా` చిత్రం బడ్జెట్ కారణంగా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. ఇక కొంత మంది సినిమా క్యాన్సిల్ అయిందంటూ చెప్పుకొచ్చారు. మరికొంత మంది రవితేజను ఎలాగైనా సినిమా చేయమని ఒప్పించడానికి పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగాడంటా వార్తలు రాసుకొచ్చారు. ఇక ఆ వార్తలు న్నీ కొట్టేపడేస్తూ చిత్ర యూనిట్ ఈ రోజు `డిస్కోరాజా` మే 27 నుంచి రెండో షెడ్యల్ ప్రారంభమవుతుందని అధికారికంగా ప్రకటించారు. దీంతో డిస్కో రాజా గురించి వచ్చిన వార్తలన్నీ ఫేక్ అని తెలింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో విఐ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్స్ నటిస్తున్నారు.