పూరి బాటలో సుక్కు!!!
on Dec 4, 2018
రామ్ చరణ్ తో `రంగస్థలం` చిత్రం చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సుకుమార్. దీని తర్వాత మహేష్ బాబుతో ఓ చిత్రాన్ని చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ లో రూపొందించుంది. అయితే ఇప్పటికే మహేష్ కోసం రెండు కథలు సిద్ధం చేసి వినిపించాడు సుకుమార్. అయితే ఆ రెండింటిలో ఏదీ కూడా మహేష్ కి నచ్చలేదట. ఆ రెండు స్టోరీస్ తో ఇంప్రెస్ చేయలేకపోయిర సుకుమార్ నెల రోజులు టైమ్ కొరాడట. ఈ నెలలో ఎలాగైనా మహేష్ తో కథ ఓకే చేయించి సినిమా పట్టాలెక్కించాలన్న కసితో ఉన్నాడట సుకుమార్. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ లోనే తన టీమ్ తో కలిసి స్టోరీస్ సిద్ధం చేసే సుకుమార్ ఈసారి మకాం మార్చినట్లు తెలుస్తోంది. అది ఎక్కడికో తెలుసా...పూరి జగన్నాథ్ పర్మినెంట్ ప్లేసైన బ్యాంకాక్ కి. ఇప్పటికే సుకుమార్ తన టీమ్ తో కలిసి బ్యాంకాక్ లో ని ఓ లగ్జరీ రిసార్ట్ లో స్టోరీ సిట్టింగ్స్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. చూద్దాం ఈ సారైన సుకుమార్ తన స్టోరీతో మహేష్ బాబుని ఇంప్రెస్ చేస్తాడో లేదో???