`డియర్ కామ్రేడ్` డేట్ ఫిక్స్!!
on May 8, 2019
యువ సంచలన హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నా `గీత గోవిందం` తర్వాత కలిసి నటిస్తోన్న చిత్రం `డియర్ కామ్రేడ్` భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రజంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు నిర్మాతలు. జూలై 26 గ్రాండ్ గా అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు అధికారికంగా ప్రకటించింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటకు , టీజర్ కు మంచి స్పందన వచ్చింది. సినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. డియర్ కామ్రేడ్ డేట్ ఫిక్స్ అవడంతో డిస్ట్రిబ్యూటర్స్ ఎలాగైనా సినిమా రైట్స్ దక్కించుకోవాలని తొందరపడుతున్నట్లు తెలుస్తోంది.