డీజే ప్రీమియర్ షో రివ్యూ
on Jun 23, 2017
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన దువ్వాడ జగన్నాధం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఇంతకీ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? అన్ని వర్గాలకి నచ్చేట్టుగా ఉందా? కామెడీ పాళ్ళు ఎంత? అల్లు అర్జున్ బ్రాహ్మణ, డీజే గెటప్పుల్లో సెట్ అయ్యాడా? పూజా హెగ్డే ఎంతవరకు అలరించింది. ప్రీమియర్ షో రివ్యూ ద్వారా మీకు సమాచారం అందిస్తున్నాం. సినిమాలో అల్లు అర్జున్ బ్రాహ్మణ అవతారంలో కనిపించినా ఇది రివేంజ్ డ్రామా. బ్రాహ్మణా పాత్రా చేయడానికి కష్టపడ్డాడు కానీ, ఎందుకో అంతగా సెట్ అవ్వలేదు.
ఇక కథ విషయానికి వస్తే అగ్రి డైమండ్ అనే సంస్థలో పెట్టుబడిదారులని హీరో ఎలా రక్షిస్తాడు? అందుకోసం ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. అగ్రి డైమండ్ అనగానే మనకు వెంటనే విజయవాడలో చిచ్చు రేపుతున్న అగ్రి గోల్డ్ వ్యవహారం గుర్తుకు వస్తుంది. అవునండీ అది బేస్ చేసుకొనే తీశారు. ఫస్ట్ హాఫ్ కాస్త ఎంటర్ టైనింగ్ గా బాగానే ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ లో జోరు తగ్గింది. క్లైమాక్స్ కూడా సడన్ గ ముగిసినట్లుగా అనిపిస్తుంది. కొత్తగా, ఫైట్ కాకుండా కామెడీ వేలో ఎండ్ చేసారు. మొత్తానికి చూస్తే, డీజే ఒకసారి చూడగలిగే సినిమా. సెకండ్ హాఫ్ కొంచెం టైట్ చేసుంటే మూవీ ఇంకోలా ఉండేది. కామెడీ పాళ్ళు పర్లేదు. కానీ ఎన్టీఆర్ అదుర్స్ రేంజ్ మాత్రం కాదు. ఫైట్స్ తక్కువ ఉన్నా పర్లేదు అనిపించాయి. అల్లు అర్జున్ డాన్స్ లు ఓకే. పూజా హెగ్డే అందంగా కనిపించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ పెద్ద అసెట్. బాక్స్ ఆఫీస్ పరంగా సినిమా యావరేజ్ నుండి ఎబోవ్ యావరేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.