English | Telugu

అంబానీకి నేను అప్పిచ్చా!

on Nov 11, 2017

 

‘నేను సూసైడ్ చేసుకోడానికి ప్రయత్నించడం ఏంటండీ బాబూ... ఎవడు చెప్పాడు ఇవన్నీ? నాకు చావంటే చచ్చేంత భయం. ఒక వేళ నేను పోతే నా కుటుంబం పరిస్థితి ఏంటి? అని ఇప్పటికీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచిస్తుంటా’ అన్నాడు కమెడియన్ అలీ. అలీ కెరీర్ తొలినాళ్లలో సినిమాలు రాకపోవడతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు ఓ వార్త ఫిలిం సర్కిల్ లో హల్ చల్ చేస్తోంది. వీనిపై అలీ ఇలా స్పందించాడు.  ఇంకా చెబుతూ- ‘‘మాది పెద్ద కుటుంబం. నాకు ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్లు. అక్కల పెళ్లిల్లు నాన్న చేసేశాడు. చెల్లెళ్లకు మాత్రం నేనే చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. బాలనటునిగా ఓ వంద సినిమాలు చేశాను. కానీ.. తర్వాత సినిమాలు తగ్గాయి. అటుఇటు కానీ వయసు అవ్వడమే కారణం. దాంతో మానసికంగా బాధ పడ్డ మాట నిజం. కానీ.. ఆత్మస్థైర్యాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అమితాబ్ లాంటి పెద్దాయనకే తప్పలేదు.. నేనెంత.

ఆయన్ను ‘నీ ముఖం అద్దంలో చూసుకున్నావా?’ అనడిగారు. కమల్ హాసన్ కే  రెండుమూడేళ్లు సినిమాల్లేవ్. నాకు సినిమాలు లేకపోవడం పెద్ద ివిషయమా? కొన్ని రోజులు పోయాక.. నిదానంగా అవకాశాలు మొదలయ్యాయ్. కామెడీ కింగ్ రాజబాబు ఇన్ స్పిరేషన్ తో ఇక్కడకు వచ్చినవాఢ్ని నేను. ఆయన్నే ఆదర్శంగా తీసుకొని నటించి.. ఈ స్థాయికి వచ్చాను. అనుకున్నట్టే చెల్లెళ్ల పెళ్లి చేశాను. అంతే తప్ప ఏనాడూ ఆత్మహత్య అనే వ్యవహారం గురించి ఆలచించలేదు. ఈ మధ్య నేను 13 కోట్లతో ఇల్లు కట్టాను అని కూడా మనోళ్లు రాశారు. ఇంకా మాట్లాడితే.. అంబానీకి నేను అప్పిచ్చా అని కూడా రాస్తారు. వాళ్లకేం చేతులో పెన్నులున్నాయ్ ఏదైనా గీసేస్తారు. నిజం అనేది ఒకటుంటుంది కదా! నేను చెన్నయ్ లో ఉన్నప్పుడు షూటింగులకు సైకిల్ మీద వెళ్లేవాడ్ని. హైదరాబాద్ వచ్చాక బైక్ మీద వెళ్లా. తర్వాత ఓ చిన్న కారు కొనుకున్నా. ఇప్పుడు మంచి కారులోనే తిరుగుతున్నా. నేను ఇల్లు కట్టిన మాట నిజం. కానీ.. బ్యాంక్ లోన్ తీసుకొని కట్టా. 13 కోట్ల ఇల్లు కాదు. మామూలు ఇల్లే’ అని చె్ప్పుకొచ్చాడు అలీ. 

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here