English | Telugu

మన్మథుడు2... టార్గెట్ చిన్మయి

on Jun 15, 2019

 

"ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ పిల్లల వయసున్న హీరోయిన్లతో హీరోలు నటించడం సాధారణమే. ఈ ధోరణి ఆగదు. ఆగుతుందా?" - జనవరిలో చిన్మయి చేసిన ట్వీట్. సోషల్ మీడియాలో మహిళలకు అందంగా ఆమె పలుమార్లు స్పందించారు. ఇటువంటి అంశాలపై అభిప్రాయాలు వెలిబుచ్చారు. కొందరు వాటన్నిటినీ బయటకు తీసి చిన్మయిని టార్గెట్ చేస్తున్నారు. అందుకు కారణం ఒక్కటే... 'మన్మథుడు 2' టీజ‌ర్‌! అది విడుదలైన తరవాత ఆమెను నెట్టింట్లో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. తనపై విమర్శలు చేసిన వారందరికీ ఆమె గట్టి సమాధానాలు ఇస్తున్నారు.

మ‌న్మ‌థుడు 2 టీజ‌ర్‌కి, చిన్మ‌యికి సంబంధం ఏంటి? అంటే ఉంది. ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకుడు. నాగార్జున హీరో. ప్రస్తుతం నాగార్జున వయసు దగ్గర దగ్గర 60 ఏళ్ళు. ఇందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వయసు 28 ఏళ్ళే. నాగార్జున వయసులో సగం అన్నమాట. ఆయన కుమారుడు నాగచైతన్య పక్కన సినిమా కూడా చేసింది. అలాగే, తన వయసు కంటే చిన్నవాళ్లను నాగార్జున ముద్దులు పెట్టుకున్నారు. వీటన్నిటినీ చూపిస్తూ చిన్మయి మీద ప్రశ్నల వర్షం కురిపించారు. అన్నిటికీ ఆమె ఒప్పిగ్గా సమాధానాలు ఇచ్చారు. కొందరిపై సెటైర్స్ కూడా వేశారు.

"ఇతర హీరో, దర్శకుడు, టీమ్ ఎవరైనా ఈ సినిమా చేస్తే మీ టూ కిందకు వస్తుందేమో?" అని ఓ నెటిజన్ చిన్మయిని అడిగాడు. "వేధింపులకు, అంగీకారానికి తేడా తెలియని వాళ్ళు ఇలాగే వాగుతారన్నమాట. వాగుతూ కూర్చోండి" అని చిన్మయి ఘాటుగా సమాధానం ఇచ్చారు. మరొకరికి "నా కంటే నా భర్తే గొప్ప ఫెమినిస్ట్" అని చెప్పారు. వయసు గురించి  ప్రశ్నించిన వ్యక్తిపై "సినిమా విడుదలయ్యాక అర్ధమవుతుంది. మీ పని చూసుకోండి" సెటైర్ వేశారు. అదీ సంగతి!


 


Cinema Galleries



Latest News


Video-Gossips