అనుపమ ఐడియాతో.. చెలియా ఉంటానే!
on Apr 26, 2019
మ్యూజిక్ వీడియో ట్రెండ్ హిందీలో, పంజాబీలో ఎక్కువ. తెలుగులో చాలా అరుదుగా మ్యూజిక్ వీడియోలు వస్తుంటాయి. హృతిక్ రోషన్, సోనమ్ కపూర్ వంటి స్టార్స్ మ్యూజిక్ వీడియోల్లో నటిస్తుంటారు. ఇటీవల విజయ్ దేవరకొండ ఒక మ్యూజిక్ వీడియోలో నటించారు. లేటెస్ట్ గా అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ లిస్టులో చేరారు. సింగర్ యాజిన్ నిజార్ పాడడంతో పాటు నటించిన ఈ మ్యూజిక్ వీడియో 'చెలియా ఉంటానే' ఈరోజు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది. మహేష్ బాబు 25వ సినిమా 'మహర్షి'లో 'నువ్వే సమస్తం....'తో పాటు 'భరత్ అనే నేను'లో 'ఓ వసుమతి ఓ వసుమతి...' అల్లు అర్జున్ 'సన్నాఫ్ సత్యమూర్తి'లో 'శీతాకాలం సూర్యుడిలా'.... ఇంకా చాలా హిట్ పాటలు యాజిన్ నిజార్ పాడాడు. అతడు చేసిన తొలి తెలుగు మ్యూజిక్ వీడియో ఈ 'చెలియా ఉంటానే'.
అనుపమ పరమేశ్వరన్ ఐడియాతో మ్యూజిక్ వీడియో చేశామని చెబుతున్నాడు యాజిన్ నిజార్. ఇంకా అతను మాట్లాడుతూ "ఒక జామ్ సెషన్ లో నేను, 'చెలియా ఉంటానే' మ్యూజిక్ డైరెక్టర్ నీరో కలిసాం. అప్పుడు సాంగ్ చేస్తే ఎలా ఉంటుందనే ఐడియా వచ్చింది. మాతో రాప్ సింగర్ ర్ అలెన్ బాబు డేనియల్ జాయిన్ అయ్యాడు. అప్పుడు మ్యూజిక్ వీడియో చేద్దామని ఐడియా లేదు. అనుపమ పరమేశ్వరన్ అ పాట విని 'మ్యూజిక్ వీడియో చేస్తే బాగుంటుంది. నేను నటిస్తా' అని చెప్పింది. అప్పుడు మేం కూడా అ మ్యూజిక్ వీడియో ఎందుకు చేయకూడదు? అని వర్క్ స్టార్ట్ చేశాం. సినిమా ఇండస్ట్రీలో నాకు ఎక్కువమంది తెలియదు. నాకున్న అతి కొద్దిమంది స్నేహితులు అనుపమ ఒకరు. తను చేస్తాం అనడంతో మేమంతా ఎక్సైట్ అయి చేశాం. ఇప్పటి వరకు సినిమాల్లో మాత్రమే నటించిన అనుపమ పరమేశ్వరన్, తొలిసారి ఒక మ్యూజిక్ వీడియోలో నటించింది" అన్నాడు.