తెలుగులో మరో బయోపిక్
on Jun 15, 2018
ఈ మధ్య బయోపిక్ ల జోరు పెరిగింది.. ఇప్పటికే మహానటి ప్రేక్షకుల మనస్సు గెలుచుకుంది.. అలానే ఎన్టీఆర్ బయోపిక్ రాబోతుంది.. అయితే బయోపిక్ ల లిస్టులో ఇంకో మూవీ కూడా చేరింది.. త్వరలో బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ తెరకెక్కనుంది.. నిజానికి ఈ బయోపిక్ ఎప్పుడో అనౌన్స్ చేసారు.. కానీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఇప్పుడు పట్టాలు ఎక్కబోతుంది.. పుల్లెల గోపీచంద్ పాత్రలో యువ హీరో సుధీర్ బాబు నటించబోతున్నాడు..అలానే ఈ సినిమాకి 'గరుడ వేగ' ఫేమ్ 'ప్రవీణ్ సత్తారు' దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తుంది.